)
Telangana Cabinet Expansion: తెలంగాణలో కేబినెట్ విస్తరణలో హైకమాండ్‌కు మరో తలనొప్పి తెచ్చిపెట్టింది. మంత్రి పదవి దక్కిన వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తుండగా, పదవి ఆశించి భంగపడ్డ నేతలు అక్కడక్కడ అలకబూనుతున్నారు. దీంతో వారిని బుజ్జగించేందుకు హైకమాండ్ సిద్ధమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. మొదటి నుంచి వచ్చిన ఊహాగానుల్లోనూ ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ చివరకు అనూహ్యంగా కాంగ్రెస్ అధిష్టానం వారికి మొండిచేయి చూపింది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు విప్ ఆది శ్రీనివాస్ ఆయన అభిమానులు, కాంగ్రెస్ నాయకులు. మంత్రివర్గంలో మున్నూరు కాపులను అస్సలు పట్టించుకోరా అని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొండా సురేఖకు మంత్రి పదవి ఇచ్చామని హైకమాండ్ చెబుతున్నట్లు తెలిసింది. కానీ కొండా మురళి మున్నూరు కాపు.. కొండా సురేఖ పద్మశాలి అని హైకమాండ్‌కు నేతలు గుర్తు చేస్తున్నారట.
తాజాగా మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురు నేతలకు మంత్రి పదవులు దక్కాయి. ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ కోటాలో వాకిటి శ్రీహారికి మంత్రిగా చాన్స్ దక్కింది. కానీ మంత్రివర్గంలో మున్నూరు కాపులకు చోటు దక్కలేదు. దాంతో మున్నూరు కాపులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం.. అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో దక్కినంత ప్రాధాన్యత మున్నూరు కాపులకు ఎందుకు ఇవ్వడం లేదని డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ మున్నూరు కాపు లీడర్లకు కొదవలేదు. ఆ పార్టీలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, లక్ష్మణ్ లాంటి లీడర్లను చక్రం తిప్పుతున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీలోనూ గంగుల కమలాకర్, జోగు రామన్న, పొన్నాల లక్ష్మయ్య, దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లాంటి నేతలకు అగ్ర తాంబూలం దక్కుతోంది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మాత్రం మున్నూరు కాపులను పక్కన పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇందుకు విరుద్దమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కేకే, వీహెచ్, ఆది శ్రీనివాస్ లాంటి సీనియర్ నేతలు ఉన్నారు. కానీ వీరికి పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజా మంత్రివర్గ విస్తరణలో వేముల వాడ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కుతుందని మున్నూరు కాపులంతా ఆశించారు. కానీ ఆయన పేరును హైకమాండ్ పక్కన పెట్టేసింది. దాంతో మంత్రివర్గంలో తనకు స్థానం లభించకపోవడంతో వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా, కాంగ్రెస్ నాయకులు, ఆది శ్రీనివాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది ఎవరు.? సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఆది శ్రీనివాస్ పేరును స్వయంగా ప్రతిపాదించిన కూడా మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారంటూ ఆవేదనను వెళ్ళబోసుకుంటున్నారు. ఢిల్లీపై లాబీయింగ్ చేయలేదని, కులం పేరిట రోడెక్కలేదని, పార్టీకు వ్యతిరేకంగా సభలు పెట్టినందుకు మంత్రి పదవి దక్కలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. అయితే మున్నూరు కాపుల స్వాభిమానానికి జరిగిన ఈ దెబ్బపై ప్రశ్నించవలసిన సమయం వచ్చిందంటూ, మంత్రి పదవికి అన్ని అర్హతలు ఉన్న పోరాట శబ్దం లేకపోతే న్యాయం జరగదా అంటూ పోస్టులు పెడుతున్నారు.
మొత్తంమీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాకాలో మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం జంకుతుందనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో 49 లక్షల మున్నూరు కాపులు ఉండగా.. ఒక్క మంత్రి పదవి ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే వచ్చే కేబినెట్ విస్తరణలో అయినా మున్నూరు కాపులకు మంత్రి పదవి కేటాయించాలని కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.