Amberpet Flyover: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. అంబర్‌పేట ఫ్లైఓవర్‌ ప్రారంభం

Big Relief To Hyderabad Commuters Finally Amberpet Flyover Opened: మహా నగరం హైదరాబాద్‌వాసులకు శుభవార్త. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కీలకమైన ఫ్లైఓవర్ ప్రారంభమైంది. నిత్యం ట్రాఫిక్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంబర్‌పేట ప్రాంతానికి మహర్దశ లభించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 26, 2025, 02:49 PM IST
Amberpet Flyover: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. అంబర్‌పేట ఫ్లైఓవర్‌ ప్రారంభం

Amberpet Flyover Open: కోట్లాది మంది ప్రజలు నివసించే భాగ్యనగరంలో వాహనాల రద్దీ పెరిగిపోతుండడంతో రోడ్లు చిన్నవిగా మారిపోతున్నాయి. రోడ్లపై వాహనాల రద్దీ కొనసాగుతుండడంతో ప్రయాణ సమయం పెరిగిపోతుంది. గంటల కొద్దీ రోడ్లపై ప్రజలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్‌ రద్దీతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఒక ఫ్లైఓవర్ ప్రారంభానికి నోచుకుంది. దాదాపు ఐదేళ్లకు పైగా సమయం పట్టిన ఆ ఫ్లైఓవర్‌ ఎట్టకేలకు ప్రారంభమవడంతో ఇకపై ట్రాఫీక్‌ రద్దీ తగనుంది. పాలకుల నిర్లక్ష్యంతో ఇన్నాళ్లు ఇబ్బందులు పడిన వాహనదారులకు ఊరట లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Atmiya Bharosa: మహా శివరాత్రికి తెలంగాణ ప్రభుత్వం కానుక.. కూలీలకు నిధులు విడుదల

ఉప్పల్‌.. సీబీఎస్‌ ప్రధాన రహదారిలో ఉన్న అంబర్‌పేటలో నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇరుకైన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ట్రాఫిక్‌తో సతమతమవుతుండేవారు. దీనికి పరిష్కారంగా 2018లో ఫ్లైఓవర్ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. శిలాఫలకం వేసినా మూడేళ్ల తర్వాత అంటే 2021లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి నత్తనడకన సాగుతున్న ఈ ఫ్లైఓవర్‌ నాలుగేళ్ల తర్వాత తుది దశకు చేరుకున్నాయి. ఇంకా పనులు పూర్తి కావాల్సి ఉండగా.. వాహనాల రద్దీ నేపథ్యంలో ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా ప్రారంభించారు.

Also Read: KT Rama Rao: 'రేవంత్ రెడ్డి 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు రాలే!

అనేక అడ్డంకులు ఎదుర్కొన్న ఈ ఫ్లైఓవర్‌ ఎట్టకేలకు పూర్తి కావడం విశేషం. అంబర్‌పేటలోని గోల్నాక నుంచి ఛే నంబర్‌, శ్రీరమణ చౌరస్తా మీదుగా 1.5 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. బుధవారం నుంచి ఈ ఫ్లైఓవర్‌పై వాహనదారుల రాకపోకలు ప్రారంభించారు. ఫ్లైఓవర్‌ కింద రోడ్ల నిర్మాణం, పచ్చదనం అలంకరణ వంటివి పూర్తయిన తర్వాత అధికారికంగా ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఉప్పల్‌ ప్రధాన రహదారి కావడంతో వరంగల్‌ వెళ్లాల్సిన వారు.. వరంగల్‌ నుంచి సీబీఎస్‌ వైపు వెళ్లాల్సిన వాహనదారులతోపాటు దిల్‌సుఖ్‌నగర్‌, స్థానిక వాహనదారులు కూడా భారీగా ఉండడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు ఈ మార్గంలో పయనిస్తుంటాయి. అనేక అడ్డంకులు, అపసోపాల అనంతరం ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి నోచుకోవడంతో కొంత వాహనాల రద్దీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ ఫ్లైఓవర్‌ పూర్తితో నగరానికి మరో నగగా మారింది.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News