Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. డీఏలపై ప్రభుత్వం కీలక ప్రకటన ఇదే!

Govt Employees Shocked About Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వం వద్ద నిధులు లేవని.. రొటేషన్‌ చేస్తూ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు.. ఇక డీఏలపై చేతులెత్తేసినట్లు ప్రభుత్వం తూచ ప్రాయంగా ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 12, 2025, 06:58 PM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. డీఏలపై ప్రభుత్వం కీలక ప్రకటన ఇదే!

Dearness Allowance: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలతోపాటు వేతనాల పెరుగుదల, పీఆర్‌సీ, డియర్‌నెస్‌ అలవెన్స్‌ వంటివి ఇవ్వాల్సి ఉంది. వీటిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యంగా జీతాలు ఇస్తున్నామని.. అయితే వాటికి వీటికి సర్దుబాటు చేస్తూ జీతాలు చెల్లిస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రొటేషన్‌ పద్ధతిలో కేటాయింపులు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు.

Add Zee News as a Preferred Source

Also Read: BAC Meeting: అసెంబ్లీలో బార్స్.. వైన్స్.. బెల్ట్‌షాపులపై చర్చించాలి

'ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో మీ సహకారం అవసరం. కొన్నిసార్లు వెనుకా ముందు ఆలస్యమైనా ఇది మన కుటుంబం. మన కుటుంబంలో నెల జీతం సరిపోనప్పుడు ఎలా అయితే సమన్వయం చేసుకుని ఆర్థికంగా సర్దుబాటు చేసుకుంటామో అదే మాదిరి ప్రభుత్వం కూడా అలాగే' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. 'అణా పైసా సహా అన్ని లెక్కలు మీకు అందిస్తా. మీరు ఓ కమిటీ ఏర్పాటుచేసుకుని ఏది పంచుతారో మీరు చెప్పినట్టు చేస్తా' అని ఉద్యోగులకు చెప్పారు.

Also Read: KCR Meeting: 'కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడండి'.. పార్టీ సభ్యులకు మాజీ సీఎం కేసీఆర్‌ ఆదేశం

'అవును.. జీతాలు బిల్లులు పెండింగ్ పెడుతున్నాం. ఆశ వర్కర్ల జీతాలు, అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు ఆపుతున్నాం. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పెండింగ్ పెట్టి రొటేషన్ చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'కష్టమైనా.. నష్టమైనా మీకు చెప్పి.. మీకు వివరించి.. మీ అనుమతి తీసుకుని.. ఏం చేయమంటే అది చేస్తా' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద తల తాకట్టు పెట్టి అప్పులు తీసుకుని జీతాలు చెల్లించా' అని రేవంత్ రెడ్డి ప్రకటించడం కలకలం రేపింది. ప్రతి నెల రూ.6,500 కోట్ల అప్పులు చెల్లిస్తున్నామని చెప్పారు. 

కొలువుల జాతర సభలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన తీవ్రమైంది. ఇప్పటికే ప్రభుత్వం ఐదు డియర్‌నెస్‌ అలవెన్స్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో మరో డీఏ రానుంది. ఇప్పటికే పీఆర్‌సీ ఇవ్వాల్సి ఉండగా అది కూడా తాత్సారమవుతోంది. ఇక పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు దక్కాల్సి ఉంది. వీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్‌ రెడ్డి బాంబు పేల్చారు. ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తే 'సర్దుకోవాలి' అని చెప్పినట్టు అర్థమవుతోంది. ఇంకొన్నాళ్లు సమయం పడుతుందని పరోక్షంగా చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News