Hyderabad Neera Cafe: గ్రామీణ ప్రాంతాల్లో లభించే ఎన్నో ఔషధ గుణాలు కలిగిన నీరాను హైదరాబాద్ మహానగరంలో విక్రయించిన విషయం తెలిసిందే. ట్యాంక్‌బండ్ పీవీ మార్గ్‌లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన నీరా కేఫ్ విజయవంతంగా కొనసాగగా.. తాజాగా ఆ కేంద్రం మూతపడనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ప్రజలకు నీరా రుచిని పరిచయం చేసిన ఈ కేఫ్‌ను ప్రభుత్వం మూసివేస్తోందని.. ఆ స్థానంలో ఓ హోటల్ వస్తోందనే వార్తలు వస్తున్నాయి. నీరా కేఫ్ మూసివేస్తున్నారనే వార్తతో నీరా ప్రియులతోపాటు హైదరాబాద్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరా కేఫ్ ఏర్పాటుకు కారణమైన మూల వ్యక్తి.. నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నీరా కేఫ్ మూసివేత అంశంపై ఉద్యమం చేస్తున్నారు.
Also Read: SLBC Tunnel Collapse: ఎస్ఎల్బీసీ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన డిమాండ్
తాజాగా జరిగిన సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో గౌడ కులస్తులు సమావేశమయ్యారు. నీరా కేఫ్‌ను వెంటనే కల్లుగీత కార్పొరేషన్‌కు అప్పగించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే నీరా ఎన్నో ఔషధ గుణాలు కలిగినదిగా ఎన్నో జబ్బులకు మందుగా పని చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Also Read: Hyderabad Water: హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. తాగునీటి కష్టాలతో నగరవాసులు విలవిల
నీరాను హైదరాబాద్ నగర ప్రజలకు అందించడానికి బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టును చేపట్టి నీరా కేఫ్‌ని ఏర్పాటు చేసినట్లు నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి నీరా కేఫ్‌ను ప్రైవేట్‌పరం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తుల అనేక సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని ప్రకటించారు.
నీరా కేఫ్‌ను ప్రైవేట్ పరం చేయడం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీరా కేఫ్‌లను గీతా పారిశ్రామిక సహకార సంఘాలకు అప్పగించాలని గౌడ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్చి 17వ తేదీన ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!
- సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలి.
- జనగామ జిల్లాకు పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలి.
- మద్యం దుకాణాలలో గౌడ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
- కలు గీసే గీత కార్మికులకు.. ప్రమాదానికి గురైన గౌడ కులస్తులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి.
- హైదరాబాద్‌లో గౌడ ఆత్మగౌరవ భవన నిర్మాణం వెంటనే ప్రారంభించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









