TGSRTC Indefinite Strike: ఆర్టీసీ ప్రయాణికులకు ఇది చేదు వార్త. కొన్ని రోజుల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే సమ్మె ప్రకటించిన ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మే 7వ తేదీ నుంచి విధులకు దూరంగా ఉండనున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నట్టు తెలుస్తోంది. ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఉచిత బస్సు ఉంటుందా? లేదా అనే చర్చ జరుగుతోంది.
Also Read: Saraswathi Pushkaralu: సరస్వతీ పుష్కరాలు ఎప్పుడు? స్నానాల ఘాట్లు ఎక్కడెక్కడో తెలుసా?
తమ సమస్యలు.. డిమాండ్లపై పోరాడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ప్రత్యక్ష పోరాటానికి దిగారు. రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించకపోవడంతో మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఇప్పటికే ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. సమ్మె తేదీ సమీపిస్తున్నా కూడా ప్రభుత్వం చర్చలకు పిలవకుండా.. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్‌కు సిద్ధమయ్యారు. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. బస్సులన్నీ డిపోల నుంచి కదలవు.
Also Read: Caste Census: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కులగణనకు నిర్ణయం
ఆర్టీసీ పరిరక్షణ, విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం జనవరి 27వ తేదీన ఇచ్చిన సమ్మె నోటీసుపై సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్ కమిషనర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమయ్యారు. ఆర్టీసీ జేఏసీ ఇటీవల అన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి సమ్మెపై తగ్గేదే లేదని ప్రకటించారు. ‘తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలది ఇక నుంచి ఒకే మాట, ఒకే బాట.. అదే సమ్మెబాట’ అని అన్ని సంఘాలు స్పష్టం చేశాయి. మే 7వ తేదీ నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని జేఏసీ పిలుపునిచ్చింది. యూనియన్ల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను, భేషజాలను విడనాడి జేఏసీతో కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. కార్మిక ప్రయోజనాల పరిరక్షణతోపాటు ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాడాలని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









