Construction Works: రియల్‌ ఎస్టేట్‌ రంగానికి భారీ షాక్‌.. రేపటి నుంచి హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణాలు బంద్‌?

Construction Works Break In Hyderabad Region Here Is The Reason: హైదరాబాద్‌లో కొన్ని రోజుల పాటు భవన నిర్మాణ పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. కాంక్రీట్‌ మిల్లర్లు అకస్మాత్తుగా సమ్మె చేపట్టనుండడంతో కొన్ని రోజులు పనులు ఆగిపోయేట్టు పరిస్థితులు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 5, 2025, 12:16 AM IST
Construction Works: రియల్‌ ఎస్టేట్‌ రంగానికి భారీ షాక్‌.. రేపటి నుంచి హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణాలు బంద్‌?

Hyderabad Real Estate: ఇప్పటికే కుదలేవుతున్న రియల్‌ ఎస్టేట్‌తో వ్యాపారులతోపాటు వినియోగదారులు భారీగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్ల పాటు భవన నిర్మాణ పనులు ఆగిపోనుందనే వార్త బిల్డర్లకు.. రియల్టర్లకు భారీ షాక్‌గా చెప్పవచ్చు. వారం పాటు పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే నిర్మాణంలో కీలకమైన కాంక్రీట్‌ మిల్లర్లు సమ్మెకు దిగనున్నారు. ఎప్పుడు లేనది ఈ రంగం వారు సమ్మెకు దిగుతుండడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఇది భారీ దెబ్బ.

Add Zee News as a Preferred Source

Also Read: Harish Rao: 'కేసీఆర్‌కు దిష్టి తగలడంతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు'

గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా ఉన్న కాంక్రీట్ మిల్లర్లు తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు సమ్మె చేపడుతున్నట్లు తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ ఓనర్ అండ్ లేబర్ యూనియన్ ప్రకటించింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలు ఆకాశాన్నంటుతుండగా.. కాంక్రీట్ మిల్లర్ల పని విషయంలో మాత్రం ధరలు భారీగా పడిపోతున్నాయని ఆ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. బిల్డర్లు కాంక్రీట్ మిల్లర్లను చిన్నచూపు చూస్తూ ధరల విషయంలో మీరు కాకపోతే ఇంకొకరు అంటూ తగ్గిస్తూ వస్తున్నారని ఆ సంఘం ఆరోపిస్తోంది. ఈ కారణంగా వారం పాటు సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించింది.

Also Read: Shobha Yatra: శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీస్‌ నిఘా.. అసాధారణ రీతిలో పకడ్బందీ బందోబస్తు

హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ ఓనర్ అండ్ లేబర్ యూనియన్ చైర్మన్ నాగరాజు, కన్వీనర్లు బీసం గోపాల్, రవి కుమార్ రెడ్డి, రేపల్లె కృష్ణ వాల్మీకి మాట్లాడారు. ఈ సందర్భంగా తమ సమస్యలు వివరించారు. కాంక్రీట్ మిల్లర్ల డిమాండ్ల సాధన కోసం ఉద్యమించడానికి సిద్ధమయ్యామని ప్రకటించారు. కాంక్రీట్ మిల్లర్ల విషయంలో ప్రభుత్వం పకడ్బందీగా నియమ నిబంధనలు రూపొందించాలని.. 5000 ఎస్‌ఎఫ్‌టీ ఉన్న పనులకు కచ్చితంగా తమ కాంక్రీట్ మిల్లర్లకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదాల బారిన పడిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపడుతున్నట్లు కాంక్ట్రీట్‌ మిల్లర్ల సంఘం తెలిపింది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్న కాంక్రీట్ మిల్లర్ల జీవితాలు మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

రేపటి నుంచి వారం పాటు కాంక్రీట్‌ మిల్లర్లు సమ్మె చేపడుతుండడంతో నగరంలో భవన నిర్మాణ పనులపై ప్రభావం పడే అవకాశం ఉంది. నిర్మాణ పనుల్లో కాంక్రీట్‌ కీలకమైనది. అది లేనిది పనులు చేయలేని పరిస్థితి. వారం పాటు సమ్మె అంటే భవన నిర్మాణాలు ఆగిపోవాల్సిందే. కాంక్రీట్‌ మిల్లర్లు చెబుతున్న సమస్యలు కూడా వాస్తవమే కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రియల్టర్లు, బిల్డర్లు కోరుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News