Congress Leaders Resign: అసెంబ్లీ ఎన్నికల్లో రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే స్థానం పొందని కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. అధికారం ఉన్నా కూడా ఆ పార్టీ నాయకులు రాజీనామా చేసి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలగా.. బీఆర్‌ఎస్ పార్టీకి జోష్ వచ్చింది. ఈ వ్యవహారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల వెనుక స్మితా సబర్వాల్.. ఆమె ఏం చేశారో తెలుసా?
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. నియోజకవర్గంలో ఉన్న నాయకుల మధ్య సమన్వయ లోపంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా సోమవారం కూడా భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నాయకులు రాజీనామాలు చేశారు. అనంతరం గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్‌ఎస్ పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కండువా కప్పారు.
Also Read: MLC Elections: తెలంగాణలో మిత్రపక్ష పార్టీల మధ్య చిచ్చు పెట్టిన 'ఎమ్మెల్సీ పోరు'
పారిశ్రామిక ప్రాంతమైన బాలానగర్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 14 నెలల పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలా అయ్యిందో ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డి పాలన బాగోలేదంటూ బీఆర్‌ఎస్ పార్టీలో చేరడం చూస్తే ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ విజయం కోసం.. కేసీఆర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు.
1/3-ఈ సందర్భంగా @kkpmla మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన 14 నెలల్లో నియోజకవర్గానికి మొండిచేయ్యే చూపిందని ఎమ్మెల్యే అన్నారు. pic.twitter.com/gybZ8Lww8I
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) February 24, 2025
1/5-మధు మాట్లాడుతూ ఏదో జరుగుతుంది కాంగ్రెస్ ఎంతో అభివృధి చేస్తారని ఊహించమని కానీ మాటలకే పరిమితమయ్యారు తప్ప కాంగ్రెస్ పార్టీ అభివృధి చేయలేదని తేలిపోయిందని అందుకే @kkpmla ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృధి చెందాలంటే కేసీఆర్ మళ్ళీ CM కావాలని మధు అన్నారు pic.twitter.com/WB2UgMmcDr
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) February 24, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









