CPI MLC Seats: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. ఐదు స్థానాలు ఖాళీ అయిన వేళ భారీ పోటీ ఎదురవుతోంది. ఈ క్రమంలోనే పదవుల కోసం నాయకులు పోటీ పడుతుండగా.. రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చేలా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. తమకు రెండు స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని.. ఆ సమయంలో తమకు ఇచ్చిన హామీ మేరకు రెండు స్థానాలు ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేసింది.
Also Read: Dasoju Sravan Kumar: ఈసారైనా దాసోజు శ్రవణ్‌కు 'ఎమ్మెల్సీ' దాసోహమవుతుందా?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీపీఐతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. కొన్ని నిమిషాల పాటు చర్చించిన అనంతరం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. 'అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాకు ఒక సీటు మాత్రమే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తానన్నారు కానీ ఇవ్వలేకపోయారు' అని కూనంనేని గుర్తుచేశారు.
Also Read: Mamnoor Airport: తెలంగాణకు గుడ్ న్యూస్.. మామునూర్ ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్
'శాసనసభ కోటాలో ఎమ్మెల్సీ ప్రకటన రావడంతో స్నేహ ధర్మాన్ని పాటించాలని కాంగ్రెస్ పార్టీని కోరాం. రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలని కోరాం' అని ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇవ్వండి తర్వాత మరొకటి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. మాకు రావాల్సిన కోటాను అడుగుతామని స్పష్టం చేశారు. 'మాకు ఇచ్చిన మాట ప్రకారం రెండు ఎమ్మెల్సీ స్థానాలు రావాలి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సంబంధించి ఒకటి ఇవ్వాలని కోరాం. మరొకటి తర్వాత ఇవ్వాలని కోరాం' అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









