Danam Nagender: అల్లు అర్జున్‌ అరెస్ట్‌లో రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ షాక్‌..

MLA Danam Nagender Condemns Allu Arjun Arrest: సినీ నటుడు అల్లు అర్జున్‌ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుండగా.. తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదం ఏర్పడింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 14, 2024, 03:23 PM IST
Danam Nagender: అల్లు అర్జున్‌ అరెస్ట్‌లో రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ షాక్‌..

Allu Arjun Arrest: తొక్కిసలాట కేసులో అరెస్టయిన సినీ నటుడు అల్లు అర్జున్‌ వ్యవహారం తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదం నడుస్తోంది. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీలు తీవ్రంగా ఖండించగా.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నోరు మెదపడానికి జంకుతున్నారు. ఈ సమయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను ఆయన ఖండించారు. ఆయన అరెస్ట్‌ బాధాకరమని పేర్కొన్నారు.

Also Read: Allu Arjun: జైలులో ఉంచడం వెనుక కుట్ర? అల్లు అర్జున్ రాత్రి జైలులో ఏం చేశాడో తెలుసా?

హైదరాబాద్‌లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ క్రమంలో మీడియా అల్లు అర్జున్‌ అరెస్ట్‌ వ్యవహారంపై స్పందించాలని కోరగా ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'హీరో అల్లు అర్జున్ మా బంధువు. అతడి అరెస్ట్ కావడం బాధాకరం' అని పేర్కొన్నారు. 'అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నా. బెయిల్ లభించడం సంతోషకరం' అని తెలిపారు.

Also Read: K Kavitha: రేవంత్ రెడ్డి పిరికి ముఖ్యమంత్రి.. ఇక ఊరూరా పోరాటం చేస్తాం

'అల్లు అర్జున్ జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పేర్లను తీసుకెళ్లి మంచిపేరు తెచ్చారు. అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోనే కాదు ప్యాన్ వరల్డ్ హీరో. అతడు అరెస్ట్ కావడం దురదృష్ట సంఘటనగా నేను భావిస్తున్నా. ప్రభుత్వం అతడిని అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం భావ్యం కాదు' అని దానం నాగేందర్‌ తెలిపారు. దానం నాగేందర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. 'దురదృష్టకరం.. బాధాకరం.. విచారం వ్యక్తం చేయడం' వంటి మాటలు చూస్తుంటే అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను దానం నాగేందర్‌ బహిరంగంగా వ్యతిరేకించినట్లు కనిపిస్తోంది.

అంటే రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా సీఎంతో విభేదాలు కొనసాగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దానం నాగేందర్‌ చేసిన వ్యాఖ్యాలు వాస్తవమేనని భావించవచ్చు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని దానం నాగేందర్‌ వ్యతిరేకించారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రానున్న రోజులు మిగతా ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారంపై స్పందించేలా పరిస్థితులు ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News