TGSRTC Price Hike: తెలంగాణ ప్రజలకు బిగ్‌షాక్‌.. ఆర్టీసీ టికెట్ల ధర భారీగా పెంపు

Telangana RTC Ticket Price Hike A Head Of NHAI Toll Charges: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ షాక్‌ల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే ఛార్జీలు పెంచగా.. ఇటీవల బస్సుపాస్‌ ఛార్జీలను పెంచగా.. తాజాగా టోల్‌ ఛార్జీల పేరిట అదనపు భారం మోపింది. దీంతో టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 19, 2025, 04:43 PM IST
TGSRTC Price Hike: తెలంగాణ ప్రజలకు బిగ్‌షాక్‌.. ఆర్టీసీ టికెట్ల ధర భారీగా పెంపు

Telangana RTC Price Hike: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ భారీ షాక్‌ ఇస్తోంది. ఇప్పటికే బస్సు పాస్‌ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ తాజాగా మరో భారం మోపుతోంది. టోల్‌ గేట్ల ఫీజు పెంచారనే నెపంతో టికెట్‌ ఛార్జీలు పెంచారని చర్చ జరుగుతోంది. ఛార్జీల పెంపుతో ప్రయాణికులపై భారీ భారం పడింది. దాదాపు రూ.10 మేర ధర పెంచినట్లు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అధికారికంగా ప్రకటించకుండా రహాస్యంగా ఇలా ఛార్జీల భారం మోపడంపై తీవ్ర దుమారం రేపుతోంది. మహాలక్ష్మి పథకం అమలుతో ప్రజలపై అదనపు భారం మోపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Harish Rao: 'బోడిగుండుకు మోకాలుకు లంకె పెట్టడంలో రేవంత్ రెడ్డి సిద్దహస్తుడు'

తెలంగాణ ఆర్టీసీ అన్ని ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసుల్లో టికెట్‌ రేట్లు రూ.10 మేర పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టోల్‌ గేట్లు ఉన్న మార్గాల్లో ఒక్కో టోల్‌గేటుకు రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. హేతుబద్ధీకరణ పేరిట అన్ని ఎక్స్‌ప్రెస్‌ల్లో ఈ ధరల పెంపు అమలవుతోంది. ఈ అదనపు భారంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) టోల్‌ ఛార్జీలు పెంచిందనే సాకుతో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులపై అదనపు చార్జీల భారాన్ని మోపుతోంది. 

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టోల్‌ గేట్లు ఉన్న మార్గాల్లో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల నుంచి టోల్‌గేటుకు రూ.10 చొప్పున ప్రయాణికుల నుంచి వసూలు చేస్తోంది. రేషనలైజేషన్‌ పేరిట రాష్ట్రంలోని అన్ని రకాల ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసుల్లో టికెట్‌ రేట్లను రూ.10 పెంచింది. ఉదాహరణకు నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే మూడు టోల్‌గేట్లు దాటాల్సి ఉంది. దీంతో టికెట్‌ రేటుకు అదనంగా ఆర్టీసీ ప్రయాణికుల నుంచి రూ.30 వసూలు చేశారు.

Also Read: Employees Holiday: రేపు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు.. ఎందుకో తెలుసా?

ధరల మార్పు
గతంలో హైదరాబాద్‌కు ఏసీ బస్సుల్లో టికెట్‌ రూ.430 ధర ఉండగా.. ప్రస్తుతం రూ.460 వసూలు చేస్తున్నారు.
ఎక్స్‌ప్రెస్‌, ఎలక్ట్రిక్‌ బస్సుల్లో టికెట్‌ రూ.360 ఉండగా 390కి పెంపు

రామగుండం మార్గంలో
హైదరాబాద్‌ నుంచి రామగుండం వెళ్లే మార్గంలోనూ 3 టోల్‌గేట్లు ఉన్నాయి. ఈ మార్గంలోనూ ప్రయాణికుల నుంచి అదనంగా రూ.30 వసూలు చేస్తున్నారు. కిలోమీటర్ల రేషనలైజేషన్‌ పేరిట అన్ని ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో టికెట్ల రేట్లను ప్రస్తుత చార్జీలతో సంబంధం లేకుండా రూ.10 చొప్పున పెంచారు.

==> కరీంనగర్‌ నుంచి పెద్దపల్లి వరకు ఎక్స్‌ప్రెస్‌ టికెట్‌ రూ.60 నుంచి రూ.70కి పెంపు
==> కరీంనగర్‌ నుంచి మంథని వరకు రూ.100 నుంచి 110కి పెరుగుదల

వరుస ఛార్జీలు
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ భారీగా వడ్డన చేస్తోంది. గతంలో చిల్లర సమస్య సాకుతో టికెట్‌ రేట్లను రౌండ్‌ ఫిగర్‌ చేస్తున్నామని చెప్పి చార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఎలక్ట్రికల్‌ బస్సుల్లో గ్రీన్‌ టాక్స్‌ పేరిట అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు.

Also Read: KTR Letter: నా సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ ఎలా అడుగుతారు? ఏసీబీకి కేటీఆర్‌ ప్రశ్నలు

 

వారికి ఉచితం.. మాకు భారం
మహాలక్ష్మి పథకంతో ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ సేవలు సాధారణ ప్రజలకు భారంగా మారాయి. బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉండడం లేదు. అరకొర బస్సుల్లో నిలబడి వెళ్తున్న ప్రయాణికులకు కొత్తగా టోల్‌ పేరిట అదనపు ఛార్జీలు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో బస్సు ఛార్జీలు పెంచిన ఆర్టీసీ ఇప్పుడు టోల్‌ పేరిట ధరలు పెంచడం ఏమిటని ప్రయాణికులు నిలదీస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి.. పురుషులపై అదనపు భారం మోపడం సరికాదని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై త్వరలో బీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు బీజేపీ, వామపక్షాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News