Zoo Park Price Hike: పర్యాటకులకు షాక్.. భారీగా పెరగనున్న జూపార్క్ ధరలు

Nehru Zoological Park Ticket Prices Hike: తెలంగాణలో పర్యాటకులకు భారీ షాక్‌ తగిలింది. జూపార్క్‌ను సందర్శించాలనుకుంటున్న పర్యాటకులకు టికెట్‌ ధరలు పెరగనున్నాయి. పెరగనున్న ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయో తెలుసా?

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 25, 2025, 10:16 PM IST
Zoo Park Price Hike: పర్యాటకులకు షాక్.. భారీగా పెరగనున్న జూపార్క్ ధరలు

Nehru Zoo Park Ticket Price Hike: తెలంగాణలో ఉన్న ఏకైక నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ టికెట్‌ ధరలు భారీగా పెరగనున్నాయి. దీంతో పర్యాటకులకు భారీ షాక్‌ తగిలింది. జూపార్క్‌ కమిటీ పర్యాటకులకు షాక్‌ ఇచ్చేలా మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల టికట్‌ ధరలు పెంచుతూ కమిటీ నిర్ణయం వెలువరించింది. ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: DK Aruna: 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు'

హైదరాబాద్‌లోని జూపార్క్‌లో మంగళవారం సమావేశమైన జ్యూస్‌ అండ్‌ పార్క్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ 13వ గవర్నింగ్‌ బాడీ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన గవర్నింగ్‌ బాడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ధరలు పెంచాలని సమావేశంలో జూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పెంచిన ధరలు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నెహ్రూ జూపార్క్‌ క్యూరేటర్‌ వసంత వెల్లడించారు.

Also Read: Neera Cafe: హైదరాబాద్‌ ప్రజలకు భారీ షాక్‌.. నీరా దుకాణం బంద్‌?

జూపార్క్‌ సందర్శించే పర్యాటకులకు ప్రవేశ రుసుము రూ.100, పెద్దలకు రూ.50 చొప్పున ధరలు పెంచుతూ జూపార్క్‌ అధికారులు తెలిపారు. ఇక ఫొటో కెమెరాతో సందర్శించే సందర్శకులకు రూ.150, వీడియో కెమెరా (ప్రొఫెషనల్‌) ఉన్నవారికి రూ.2,500, కమర్షియల్‌ సినిమా చిత్రీకరణ కోసం కెమెరా అయితే రూ.10 వేలు వసూలు చేయనున్నారు.

ధరలు ఇలా..
జూపార్క్‌లో ఉండే ట్రైన్‌ ప్రయాణానికి పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40కి ధరలు పెంచారు.
ఇక బ్యాటర్‌ ఆపరేటెడ్‌ వాహనం వినియోగించుకునే సందర్శకులకు పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.70 చొప్పున జూ కమిటీ నిర్ణయించింది.
జూపార్క్‌లో సఫారీ డ్రైవ్‌ సీఎన్‌జీ బస్‌ 20 నిమిషాలకు ఏసీ రూ.150, నాన్‌ ఏసీ రూ.100
11 సీట్లు గల న్యూ బ్యాటరీ ఆపరేటెడ్‌ వెహికిల్‌లో 60 నిమిషాల షికారుకు రూ.3 వేలు,
14 సీట్లు ఉన్న బీఓవీ ఎక్స్‌క్లూజివ్‌ వాహనంలో షికారుకు రూ.4 వేలు

పార్కింగ్‌ ఫీజులు ఇలా..
సైకిల్‌కు రూ.10
బైక్‌లు రూ.30
ఆటో రూ.80
కారు/జీప్‌ రూ.100
టెంపో/తుఫాన్‌ రూ.150
మినీ బస్సు రూ.200
పెద్ద బస్సు రూ.300

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News