Allu Arjun Arrest: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్.. మృతురాలు రేవతి భర్త కేసు వెనక్కి?
Revathi Husband Interest To Withdraw Case Against Allu Arjun: తొక్కిసలాట మృతురాలి భర్త భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌పై కేసును ఉపసంహరించుకుంటానని ప్రకటించారు. దీంతో ఏం జరుగుతుందా అనేది ఉత్కంఠ నెలకొంది.
Allu Arjun Case: సినిమా థియేటర్‌లో తొక్కిసలాట జరిగి రేవతి అనే వివాహిత మృతి చెందిన సంఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ వ్యవహారం ఆగమేఘాల మీద జరిగింది. నోటీసులు ఇవ్వకుండా.. విచారణ చేయకుండా నేరుగా అరెస్ట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అల్లు అర్జున్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన బాధితుడు భాస్కర్ దానిని ఉపసంహరించుకుంటానని ప్రకటించడం సంచలనం రేపింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసును తాను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
Also Read: Allu Arjun: పోలీసుల అత్యుత్సాహం.. బెడ్రూమ్‌లోకి రావడంపై అల్లు అర్జున్ ఆగ్రహం
సినీ పరిశ్రమలో శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసింది. న్యాయస్థానం కూడా బన్నీ అరెస్ట్‌లో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి భర్త స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని తాను టీవీలో చూసినట్లు తెలిపాడు. 'మా బాబు చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్నా. అరెస్ట్ విషయం టీవీలో చూశా' అని మృతురాలి భర్త భాస్కర్ తెలిపారు.
Also Read: Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నేనేమీ చేసేది లేదు
'నా కొడుకు పుష్ప 2 సినిమా చూస్తా అంటే సంధ్య థియేటర్‌కు వెళ్లాం. అక్కడ అల్లు అర్జున్ రావడంలో ఆయన తప్పు లేదు. మేము ఏమైనా ఉంటే కేసు ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అరెస్ట్ వార్తలు పోలీసులు ఏమీ నాకు సమాచారం ఇవ్వలేదు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అరెస్ట్‌ను ఫోన్‌లో చూశా. అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదు' అని మృతురాలు రేవతి భర్త భాస్కర్ తెలిపారు.
మృతురాలి భర్త చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఒకవేళ ఆయన కేసు వెనక్కి తీసుకుంటే పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది. బాధితుడే కేసు వెనక్కి తీసుకుంటే ఇక అరెస్ట్.. రిమాండ్ వంటివి ఉండవని అల్లు అర్జున్ అభిమానులు భావిస్తున్నారు. కాగా ఈ అరెస్ట్ వ్యవహారంపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటుడు నాని, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, నటుడు బ్రహ్మాజీ తదితరులు స్పందిస్తూ 'ఘటనలో ఒక్కరినే బాధ్యులను చేయడం సరికాదు' అని అందరూ పేర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter