Hyderabad: రన్నింగ్ ట్రైన్‌లో అత్యాచార యత్నం.. షాకింగ్ నిజం బైటపెట్టిన యువతి.. పోలీసులు సీరియస్..

girl jumps from mmts train case: హైదరాబాద్ లో ఇటీవల యువతి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన ఘటనపై రైల్వే పోలీసులు సీరియస్ దర్యాప్తు చేపట్టారు. దాదాపు..  250 సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. ఈ ఘటన తెలంగాణలో రాజకీయంగా కూడా దుమారంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 18, 2025, 04:14 PM IST
  • ఎంఎంటీఎస్ ఘటనలో బిగ్ ట్విస్ట్..
  • సీరియస్ అయిన పోలీసులు..
Hyderabad: రన్నింగ్ ట్రైన్‌లో అత్యాచార యత్నం.. షాకింగ్ నిజం బైటపెట్టిన యువతి.. పోలీసులు సీరియస్..

Big twist in Girl jumps from running Hyderabad Mmts train: హైదరబాద్ లో ఇటీవల ఒక యువతి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కు రాత్రి పూట ఎంఎంటీఎస్ లో బయలు దేరింది. అయితే.. రాత్రి ట్రైన్ లో ఒక్కతే ఉండటంతో తనపై ఒక వ్యక్తి అత్యాచారయత్నం చేశాడని.. దీంతో రన్నింగ్ ట్రైన్ నుంచి దూకినట్లు సదరు యువతి పోలీసులకు చెప్పింది. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా పెనుసంచలనంగా మారింది.

Add Zee News as a Preferred Source

దీనిపై రాజకీయంగా కూడా రచ్చ జరిగింది. కేంద్ర మంత్రి బండిసంజయ్ ఆదేశాల మేరకు యువతిని ప్రత్యేకంగా యశోద ఆస్పత్రిలో ఉంచి మరీ చికిత్స అందించారు. అయితే..ఈ ఘటనలోయువతి పోలీసులకు బిగ్ షాక్ ఇచ్చింది. యువతి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దాదాపు.. ఆ ప్రాంతంలోని 250 సీసీకెమెరాలను జల్లెడ పట్టారు.  

అదే విధంగా 100 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు . అయిన కూడా ఎలాంటి క్లూ మాత్రం దొరలేదు. దీంతో పోలీసులు యువతిని పలుమార్లు ఈ ఘటనపై మార్చి మార్చి ప్రశ్నలు వేయడంతో.. చివరకు తనపై అలాంటి అఘాయిత్యం ఏంజరగలేదని యువతి నిజం ఒప్పుకుంది. ఈ క్రమంలో యువతి చెప్పింది విని పోలీసులు బిత్తరపోయారు.

Read more: Urvashi Rautela Video: నాకు గుడి కట్టి పూజలు చేయండి..!.. షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య భామ.. వీడియో వైరల్..  

ఎంఎంటీఎస్ లో రీల్స్ చేస్తుండగా.. కాలు జారీ కిందపడ్డానని చెప్పింది. ఒకవేళ తాను రీల్స్ చేస్తు పడ్డానని చెబితే.. ఇంట్లో వీపు విమానం మోత మోగిస్తారని భయపడి.. అత్యాచార యత్నం జరిగిందని నాటకం ఆడినట్లు  ఒప్పుకుంది. దీంతో పోలీసులు మొత్తంగా ఇప్పటి వరకు ఈ ఘటనపై పడిన కష్టం అంతా వ్యర్థమని తెలిపోయింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు ప్రస్తుతం యువతిపై సీరియస్ గా ఉన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News