)
Group 1 Mains Aspirants: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మార్కుల విషయంలో ప్రభుత్వం సక్రమంగా స్పందించడం లేదని వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. మెయిన్స్ పరీక్ష ఫలితాల అంశంపై నిరుద్యోగులు పోరాట బాట పట్టారు. మెయిన్స్ రీవాల్యుయేషన్ సక్రమంగా చేయడం లేదని.. తిరిగి నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రూప్ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్ జరిపించాలని అభ్యర్థులు సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. రీవాల్యుయేషన్ జరిపించాలని దానికి గల కారణాలను పిటిషన్లో గ్రూప్ 1 అభ్యర్థులు వివరించారు. గ్రూప్ 1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు ఆరోపించారు. 18 రకాల సబ్జక్టులు ఉంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే దిద్దించారని పిటిషనర్లు తెలిపారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని పిటిషనర్లు వాదించారు.
ఒకే నిపుణులతో తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దించారని పిటిషన్లో అభ్యర్థులు వాపోయారు. ఒకే నిపుణుడితో రెండు భాషల పేపర్లు దిద్దించడంతో నాణ్యత కొరవడిందని పిటిషనర్లు వాపోయారు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. పిటిషనర్ల వాదనల తర్వాత టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు అందించారు. నాలుగు వారాల్లో కౌంటర్ వేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 మెయిన్స్‌పై విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
గ్రూప్ 1 వివరాలు
రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 31,403 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికవగా.. 21,093 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. గ్రూప్ 1 మెయిన్స్‌పై తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు దాకా ఈ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి