Raj Tarun Lavanya: రాజ్‌ తరుణ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. లావణ్యపై తల్లిదండ్రుల దాడి

Big Twist In Hero Raj Tarun Case: స్తబ్దుగా ఉన్న రాజ్‌ తరుణ్‌, లావణ్య వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లావణ్యపై రాజ్‌ తరుణ్‌ కుటుంసభ్యులు దాడికి పాల్పడ్డారనే వార్త కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ లొల్లి హాట్‌ టాపిక్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 16, 2025, 04:55 PM IST
Raj Tarun Lavanya: రాజ్‌ తరుణ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. లావణ్యపై తల్లిదండ్రుల దాడి

Raj Tarun Lavanya Case: యువ నటుడు రాజ్‌ తరుణ్‌ సినిమాల కన్నా అతడి మాజీ ప్రియురాలు లావణ్య వలన అతడి జీవితం ఒక విధంగా నాశనమైందనే చెప్పవచ్చు. నెలలు గడుస్తున్నా ఆ వివాదానికి ఒక ముగింపు రావడం లేదు. తాజాగా లావణ్య అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడిని వేధిస్తున్నావని.. అతడి జీవితం నాశనం చేస్తున్నావనే ఆరోపణలు చేస్తూ రాజ్‌ తరుణ్‌ కుటుండసభ్యులు లావణ్యపై దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ శివారులోని కోకాపేటలో ఉన్న విల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Add Zee News as a Preferred Source

Also Read: Love Marriage Murders: ఏపీలో ప్రియురాళ్ల వరుస హత్యలు.. ప్రేమ పెళ్లి అంటేనే హడల్‌

హీరో రాజ్ తరుణ్ హైదరాబాద్‌ వచ్చాక అతడికి లావణ్య పరిచయమవడం.. ఆమె కారణంగా హైదరాబాద్‌లో కొన్నాళ్లు తిండి, బట్ట, వసతికి ఇబ్బందులు లేకుండా ఉన్నాడు. అంతేకాకుండా ఆమెతో ప్రేమాయణం సాగించాడు. ఓ విల్లాలో ఇద్దరూ సహజీవనం చేస్తుండగా.. ఓ వ్యక్తితోపాటు లావణ్యకు ఇతర వ్యాపకాలు అలవాటు కావడంతో కొంత దూరంగా ఉన్నాడు. అయితే సినీ నటుడిగా తన జీవితమేదో అనుభవిస్తుండగా లావణ్య తిరుగుబాటు చేసింది. రాజ్‌ తరుణ్‌ తనను మోసం చేశాడని లావణ్య మొదలుపెట్టిన వివాదం ఎపిసోడ్‌ల మీద ఎపిసోడ్‌లు కొనసాగుతున్నాయి. కొన్నాళ్లు ఈ రచ్చ ఆగిపోయిందని భావించగా ఉన్నఫళంగా రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు లావణ్యపై దాడికి పాల్పడ్డారు.

Also Read: Tirumala Drone: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం.. డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్

కోకాపేటలోని విల్లాలో లావణ్యపైన రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేశారు. లావణ్యను దుర్భాషలాడుతూ ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఇంట్లో సీసీ కెమెరాలు పగలగొట్టారని.. అద్దాలు ధ్వంసం చేశారని సమాచారం. ఈ సమాచారం అందుకున్న నార్సింగ్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లావణ్యపైన దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మరోసారి సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

రాజ్‌ తరుణ్‌ జీవితంతో ఆడుకుంటోందని.. తన కుమారుడి ఇంటిని లావణ్య యథేచ్ఛగా ఉంటోందని రాజ్‌ తరుణ్‌ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా కుటుంబసభ్యులు కోరుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల రాజ్ తరుణ్‌కు క్షమాపణ చెబుతూ.. అతడిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటాని లావణ్య చెప్పింది. ఇక రాజ్‌ తరుణ్‌తో ఎలాంటి వివాదం ఉండదని భావిస్తున్న క్రమంలో ఈ దాడి కలకలం రేపింది. అయితే తనపై జరిగిన దాడి విషయమై రెండు, మూడు రోజుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు లావణ్య తెలిపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News