Indiramma Indlu Scheme: అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేను నెలలు అవుతున్నా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక హామీ అయిన ఇందిరమ్మ ఇళ్లపై నాన్చివేత ధోరణి కొనసాగిస్తోంది. ఇప్పుడు.. అప్పుడు అంటూ ఇందిరమ్మ ఇళ్లపై గడువు పెంచుకుంటూ వెళ్తుండగా తాజాగా ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు. పేదలకు అరకొరగా అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఏ క్షణమైనా రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. అర్హులకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించినట్లు తెలిస్తే ఏ దశలో ఉన్నా కూడా తాము రద్దు చేస్తామని తెలంగాణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Also Read: KTR Chit Chat: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. 'రేవంత్ రెడ్డి వెనక నలుగురు బ్రోకర్లు'
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సోమవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణం, మంజూరు, ఏయే దశల్లో ఉన్నాయనే వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష చేశారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు. గ్రామసభ దరఖాస్తుల నుంచి అర్హులను ఎంపిక చేయాలని చెప్పారు.
Also Read: TGPSC Group 1 Results: టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోవడం ఇలా
మొదటి విడతలో 562 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు పొంగులేటి తెలిపారు. ఈ ఇళ్లు మంజూరు చేసిన సమయంలో ఎదురైన సమస్యలు, ఆటంకాలు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా లబ్ధిదారుల ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. అర్హులను లబ్ధిదారులుగా గుర్తించడం పకడ్బందీగా చేయాలని.. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సూచించారు.
అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు జారీ చేస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు వస్తుండడంతో వాటిపై పొంగులేటి అధికారులతో చర్చించారు. 'అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని గుర్తిస్తే వాటిని వెంటనే రద్దు చేయాలి' అని అధికారులకు ఆదేశించారు. 'దరఖాస్తు చేసినప్పుడు అర్హులను గుర్తించాలి. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు రాలేదనే ఫిర్యాదులు వస్తే వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలి' అని పొంగులేటి సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook








