Telangana Cabinet Expansion: కేబినెట్‌ విస్తరణలో కొత్త ట్విస్ట్.. డైలామాలో కాంగ్రెస్ హైకమాండ్..!

Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో కొత్త ట్విస్ట్ నెలకొందా..! కేబినెట్‌ విస్తరణలో సామాజికవర్గాల ఎఫెక్ట్‌ పడిందా..! కేబినెట్‌లో ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలని దళిత ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్‌ లేఖ రాశారు. అటు ఎస్టీలు కూడా తమకు కేబినెట్‌లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. దాంతో పార్టీ హైకమాండ్‌ డైలామాలో పడిందా..!    

Written by - G Shekhar | Last Updated : Mar 26, 2025, 08:38 PM IST
Telangana Cabinet Expansion: కేబినెట్‌ విస్తరణలో కొత్త ట్విస్ట్.. డైలామాలో కాంగ్రెస్ హైకమాండ్..!

Telangana Cabinet Expansion: తెలంగాణలో కేబినెట్‌ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..! ఉగాది రోజున లేదంటే.. ఏప్రిల్‌ మూడోతేదీన కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని అంటున్నారు..! ఇప్పటికే పలువురి పేర్లను హైకమాండ్ ఫైనల్ చేసిందని ప్రచారం సాగుతోంది. ఇందులో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి, విజయశాంతి, వివేక్‌, వాకిటి శ్రీహారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.. అటు ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎస్టీ కోటా నుంచి బాలు నాయక్‌, ఇతర నేతల పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ నేతకు తప్పకుండా మంత్రి వర్గంలో చోటు కల్పించాలని దళిత ఎమ్మెల్యేలు హైకమాండ్ లేఖ రాయడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. దాంతో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో మరో చర్చ జరుగుతోంది. ఒకే ఇంట్లో రెండేసీ మంత్రి పదవులు ఎలా ఇస్తారని కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.. 
 
ప్రస్తుతం నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. వీరిలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే.. ఇప్పుడు రాజ్‌గోపాల్‌ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే.. రెడ్డి సామాజికవర్గం నుంచి ముగ్గురికి పదవులు ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడే పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంత్రి పదవి రేసులో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామ్మెహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నారు. అయితే వీరిలో రాజ్‌గోపాల్‌ రెడ్డికి దాదాపు ఖాయమైందని అంటున్నారు. అటు అసెంబ్లీలోనూ పలువురు నేతలు ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పార. ఇదే సమయంలో తనకు హోంశాఖ పదవి అంటే ఇష్టమని రాజ్‌గోపాల్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. కానీ ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి విషయంలో ఓ చిక్కుముడి ఏర్పడినట్టు టాక్‌ వినిపిస్తోంది. 
 
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్‌గోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో.. సొంత సామాజికవర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. అల్రెడీ రాజ్‌గోపాల్‌ రెడ్డి అన్నయ్య వెంకట్‌ రెడ్డి మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు పదవులు ఎలా ఇస్తారని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. అసలు కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేని జిల్లాలుగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉన్నాయి. అలాంటప్పుడు ఒకే జిల్లా, ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ కొందరు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్‌. వాస్తవానికి బీజేపీలో నుంచి కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే రాజ్‌గోపాల్ రెడ్డికి కాంగ్రెస్‌ పెద్దలు మంత్రి పదవిపై హామీ ఇచ్చారట. భవిష్యత్తులో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని చెప్పారట. అందుకే రాజ్‌ గోపాల్ రెడ్డి కూడా తనకు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే పార్టీ పెద్దలను కోరినట్టు తెలిసింది. 
 
ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి విషయంలో తగ్గేదేలేదని అంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయినా తనకు తప్పకుండా పదవి ఇవ్వాల్సిందే అంటున్నారు. తనకు మంత్రి పదవి విషయంలో తన సామాజికవర్గమే అడ్డొస్తే..ఎమ్మెల్యే పదవికి రాజీనామా సైతం చేసేందుకు రెడీ అంటున్నారు. తన స్థానంలో ఓ బీసీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించి మంత్రిని చేసుకుంటానని చెబుతున్నారు. అటు మరో రెడ్డి సామాజికవర్గం లీడర్‌ సుదర్శన్ రెడ్డి కూడా తనకు కేబినెట్ బెర్త్‌ ఖాయమని భావిస్తున్నారు. దాంతో ఏ రెడ్డికి పదవి ఇవ్వాలో తెలియక హైకమాండ్‌ పెద్దలు డైలామాలో పడ్డారని అంటున్నారు. ఒకవేళ మల్‌రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి వైపు హైకమాండ్ మొగ్గుచూపితే.. రాజ్‌గోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు. ఒకవేళ రాజ్‌గోపాల్‌కు పదవి ఇస్తే.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఆశాభంగం తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో తన సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డికి పదవి విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...తమ్మడికి మంత్రి పదవిపై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. కొత్త మంత్రుల విషయంలో తనను ఎవరు సంప్రదించలేదన్నారు. తన తమ్ముడికి మంత్రి పదవి వస్తుందన్న విషయం కూడా తనకు తెలియదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మొత్తంగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చర్చనీయాంశం అవుతోంది. 

Add Zee News as a Preferred Source

Also Read: RC 16 First Pre Look: రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్ రెడీ.. RC 16 మూవీ ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్..

Also Read: School Holidays: విద్యార్ధులకు సూపర్ గుడ్‌న్యూస్, ఏప్రిల్ లో 3-4 రోజులు సెలవులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

G Shekhar

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News