Group 1 Posts: తెలంగాణ గ్రూప్-1 పోస్టుల భర్తీపై బిగ్‌ ట్విస్ట్‌.. రంగంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్

Big Twist In TSPSC Group 1 Posts: తెలంగాణ నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న గ్రూపు 1 ఉద్యోగాల భర్తీలో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. తీవ్ర ఆరోపణలు.. వివాదం నెలకొన్న గ్రూపు 1 ఉద్యోగాలపై బండి సంజయ్‌ రంగంలోకి దిగారు. కమిషన్‌కు లేఖ రాసి సమగ్ర వివరాలు తనకు సమర్పించాలని డిమాండ్‌ చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 30, 2025, 03:19 PM IST
Group 1 Posts: తెలంగాణ గ్రూప్-1 పోస్టుల భర్తీపై బిగ్‌ ట్విస్ట్‌.. రంగంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్

TGPSC Group 1 Posts: అనేక వివాదాలతో తెలంగాణ గ్రూపు 1 ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మొండిగా ముందుకుపోతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు, తప్పిదాలు జరిగాయని అభ్యర్థుల ఆందోళన చేస్తుండగా రంగంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ దిగారు. అభ్యర్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న బండి సంజయ్ అభ్యర్థుల తరఫున టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం కు లేఖ రాశారు.

Add Zee News as a Preferred Source

Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్లు.. డీఏ పెంపుతోపాటు 8 భారీ కానుకలు

అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలను బండి సంజయ్‌ లేఖలో ప్రస్తావించారు. వారం రోజుల్లో సమగ్ర సమాచారాన్ని అందించాలని టీజీపీఎస్సీని బండి సంజయ్‌ కోరారు. ఇప్పటికే గ్రూప్ 1పై హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా.. అభ్యర్థుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలతోపాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు వస్తుండడంతో బండి సంజయ్ కుమార్ నివారణ చర్యలు చేపట్టారు.

Also Read: Allu Arjun Sritej: ఆస్పత్రి నుంచి శ్రీతేజ్‌ డిశ్చార్జ్‌.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్‌

గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీని రద్దు చేయాలని.. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తుండడంతో దానిని లేఖలో బండి సంజయ్‌ ప్రస్తావించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, ఫలితాల విషయంలో అనేక అక్రమాలు, అవకతవకలు, తప్పిదాలు జరిగాయని, నిబంధనల ఉల్లంఘన జరిగిందని వీటన్నింటిని నివృత్తి చేయాలని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు సూచించారు. గ్రూప్ 1 పరీక్ష, ఫలితాలకు సంబంధించి ఈ కింది సమాచారాన్ని వారం రోజుల్లో పంపగలరని కోరుతూ పేజీల లేఖ రాశారు.  

ప్రధానంగా మార్కుల ప్రకటన, నోటిఫికేషన్ ఉల్లంఘన, పరీక్షా పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లతోపాటు ఉర్దూ మీడియంలో రాసిన అభ్యర్థులకు టాప్ ర్యాంకులు రావడాన్ని బండి సంజయ్‌ లేఖలో ప్రస్తావించారు. హైకోర్టులో గ్రూప్ 1 కేసు విచారణ కొనసాగుతుండడంతో కమిషన్‌ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా అవసరమైతే బండి సంజయ్‌ ఇంప్లీడ్ కావాలని భావిస్తున్నారు. అవినీతి, అక్రమాలు, తప్పిదాలకు తావులేకుండా మెరిట్ ప్రాతిపదికగా ఉద్యోగ నియామకాలు జరిగేలా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని బండి సంజయ్‌ డిమాండ్ చేస్తున్నారు. మార్కుల ప్రకటన, మూల్యాంకన ప్రక్రియ, హాజరు వివరాలు, ఫలితాల ప్రకటనకు ముందు డేటా లీక్, కోడ్ ఆధారిత మార్కుల నకిలీ లక్షణాలు, కేంద్రాల వారీగా అసమాన ఫలితాలు, అదనపు సమాచారం తెలపాలని లేఖలో బండి సంజయ్‌ టీఎస్‌పీఎస్సీని డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News