Telangana New Ration Cards: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీని ప్రారంభించింది. ఇప్పటికే ప్రజా దర్బార్, ప్రజా పాలన పేరిట నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజల నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకున్నారు. తాజాగా ఆ దరఖాస్తులకు మోక్షం లభించినట్టు తెలుస్తోంది. రేషన్ కార్డులను ఇస్తామని చెప్పిన ప్రభుత్వం పేర్ల తొలగింపు.. అర్హుల గుర్తింపు వంటి కారణాలతో జాప్యం జరగ్గా తాజాగా కొత్త రేషన్ కార్డుల జారీలో కదలిక వచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పఅర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. రేషన్ కార్డు నంబర్లు వచ్చాయని సందేశాలు వస్తున్నాయి. ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే.. మీ రేషన్ కార్డు పురోగతి ఎలా ఉందో తెలుసుకోవడం చాలా సులభం.
Also Read: Kalvakuntla Kavitha: జైలు జీవితం తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫుల్ హ్యాపీ
కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వారు మే నెల నుంచే రేషన్ దుకాణంలో బియ్యం తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. కార్డులు మంజూరైన వారికి మొబైల్ ఫోన్‌లకు సందేశాలు వెళ్తున్నాయి. ఆ సందేశాలలో రేషన్ కార్డు నంబర్ ఉంది. ఇక రేషన్ కార్డుల మార్పులు.. చేర్పులు చేసుకున్నవారివి కూడా అప్‌డేట్ అయ్యాయి. రేషన్ వేసుకునేందుకు వెళ్లగా ఆ వివరాలు తెలుస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్డులో పేరు ఎక్కించడం, పాత కార్డులో పేరు తొలగిచండం వంటివి ఇంకా ఉన్నాయి. వాటిని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Revanth Reddy: 'పాలన చేతకాదన్న వాళ్లకు తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టాం': రేవంత్ రెడ్డి
తెలుసుకోవడం ఇలా..
రేషన్ కార్డు నంబర్ ఉన్నవారు ఆన్‌లైన్‌లో తమ స్టేటస్ తెలుసుకోవచ్చు. https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్‌సైట్‌లో ఎడమవైపు కనిపించే ఆప్షన్లలో FSC Search పై క్లిక్ చేయాలి. అనంతరంరేషన్ కార్డు స్టేటస్ పేజీకి వెళ్తుంది. అక్కడ రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేసి, జిల్లాను ఎంపిక చేసుకోవాలి. అనంతరం సెర్చ్ బటన్‌పై క్లిక్ చేస్తే కుటుంబసభ్యులు వివరాలు కనిపిస్తాయి.
పాత దానిలో పేరు తొలగిస్తేనే కొత్తది
ప్రజాపాలన, గ్రామసభలు, మీ సేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే కార్డులు ఉన్నవారు మార్పులుచేర్పుల కోసం దరఖాస్తు చేసుకోగా అర్హత కలిగిన వారికి కొత్త కార్డులు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. కుటుంబం నుంచి వేరుపడిన వారికి కొత్త కార్డు రావాలంటే పాత కార్డులో ఉన్న పేరును తొలగించుకోవాల్సిందే. పేరు తొలగించిన తర్వాత కొత్త కార్డులు మంజూరు చేస్తారు.
కొత్త రేషన్ కార్డులు మంజూరు కాని దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. చాలా దరఖాస్తులు ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయని త్వరలోనే అవి కూడా పూర్తవుతాయని పేర్కొంటున్నారు. ఏమైనా సందేహాలు ఉంటే స్థానిక అధికారులను సంప్రదించాలని పౌరసరఫరాల శాఖ సూచిస్తోంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి