Weather Alert: తెలంగాణలో ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అలాగే ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్, మహబూనగర్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు (శుక్రావారం) కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అకాల వర్షాల వల్ల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా మామిడి, మిర్చి రైతులు ఈ వడగండ్ల వానతో ఎక్కువగా నష్టపోయే అవకాశాలున్నాయి. అంతేకాదు కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యంతో పాటు మొక్కజొన్న రైతులు కూడా అకాల వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచనలు చేస్తోంది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









