Viral Video: హైదరబాద్‌లో ఘోరం.. బీర్ సీసాతో పోలీసు తలపగల గొట్టిన బైక్ రేసర్.. షాకింగ్ వీడియో వైరల్..

Hyderabad: బైక్ రేసర్ ఏకంగా కమాండ్ కంట్రోల్ వద్ద కానిస్టేబుల్ పై బీర్ సీసాతో దాడికి దిగాడు. అంతే కాకుండా.. అడ్డువచ్చిన వారిని బెదిరిస్తు నానా హంగామా చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 25, 2025, 05:32 PM IST
  • కానిస్టేబుల్ పై బీర్ సీసాతో దాడి..
  • బంజారా హిల్స్ లో ఘటన..
Viral Video:  హైదరబాద్‌లో  ఘోరం.. బీర్ సీసాతో పోలీసు తలపగల గొట్టిన బైక్ రేసర్.. షాకింగ్ వీడియో వైరల్..

Bike racer attacks on Constable with beer Video: తెలంగాణలో గత కొన్నిరోజులుగా నడిరోడ్డు మీద అనేక ఘోరాలు జరుగుతున్నాయి. కొందరు ప్రత్యర్థులను కాపుకాచీ చంపేస్తున్నారు. మరికొన్ని చోట్ల చోరీలు జరుగుతున్నాయి. కొంత మంది సూపారీ గ్యాంగ్ వాళ్లు, ఎన్నో ఏళ్ల నుంచి పగతో రగిలిపోతున్న వాళ్లు.. తమ ప్రత్యర్థులను అత్యంత క్రూరంగా అందరి ముందే కసితీరా పొడిచి చంపుతున్నారు. అసలు చుట్టుపక్కల జనాలు ఉన్నారు.. ఏదైన జరుగుతుందన్న భయం వాళ్లలో ఏ కోసానా కూడా కన్పించడంలేదు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో ఎవరికైన అన్యాయం జరిగితే.. పోలీస్ స్టేషన్ కువెళ్లి బాధితులు ఫిర్యాదు చేస్తారు. కానీ ప్రస్తుతం పోలీసుల భద్రత కూడా పెనుసవాల్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఏకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ కు దగ్గరలోనే కానిస్టేబుల్ ను ఒక బైక్ రేసర్ బీర్ సీసాతో తలపగుల గొట్టాడు.ఈ ఘటన పోలీసులకే సవాల్ వేసిదిగా మారిందని చెప్పుకొవచ్చు. 

 

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ బైక్ రేసర్ టోలి చౌకీ నుంచి వేగంగా దూసుకొస్తున్న బైక్ రేసర్ ఖాజా బంజారాహిల్స్‎లోని ఒమేగా హాస్పిటల్ వద్ద కారును ఢీకొట్టాడు. దీంతో కార్ డ్రైవర్, ఖాజా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో అక్కడ నుంచి కానిస్టేబుల్ శ్రీకాంత్ విధులకు వెళ్తున్నాడు. అతను ఆగి.. ఖాజా, డ్రైవర్ లు ఇద్దరికి సముదాయిస్తున్నాడు. ఇంతలో రెచ్చిపోయిన ఖాజా.. అక్కడున్న బీర్ బాటిల్ తీసుకుని కానిస్టేబుల్ తలపై పగలగొట్టాడు.

అంతటితో ఆగకుండా.. ఎవర్ని తెచ్చుకుంటావో.. తెచ్చుకొ.. ఇక్కడ ఉంటానని సవాల్ విసిరాడు. దీంతో అక్కడున్న వారంత సదరు వ్యక్తిని పట్టుకుని బంధించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read more: Gaddam Prasad Video: ఆ మాటలను విత్ డ్రా చేసుకుంటున్న.. సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన స్పీకర్.. వీడియో ఇదే..

ఈ మేరకు కానిస్టేబుల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  బంజారా హిల్స్.. ఏసీపీ, డీసీపీలు వచ్చి.. ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏకంగా పోలీసుల మీదే దాడి జరిగితే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News