Alleti Maheshwar Reddy: రేవంత్‌ను మార్చేందుకే ఆమె తెలంగాణకు వచ్చారు.. బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే..

Bjp alleti maheshwar reddy comments: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తొందరలోనే సీఎం మారబోతున్నారని జోస్యం చెప్పారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 3, 2025, 08:16 PM IST
  • మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..
  • డిసెంబర్ లోపు సీఎం మారతారని వ్యాఖ్యలు..
Alleti Maheshwar Reddy: రేవంత్‌ను మార్చేందుకే ఆమె తెలంగాణకు వచ్చారు.. బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే..

Bjp mla alleti Maheshwar reddy comments on cm revanth reddy: తెలంగాణలో కాంగ్రెస్ లో ఢిల్లీ నుంచి వచ్చిన మీనాక్షి నటరాజన్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వచ్చి రావడంతోనే ఆమె తనదైన మార్కు చూపించారు. గాంధీ భవన్ లో సమావేశంలో మాట్లాడుతూ.. తన బ్యాగులు పట్టుకొవాల్సిన అవసరంలేదన్నారు. ఫ్లెక్సీలు, బోకేల సంప్రదాయాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక మీద ఎవరైన సరే.. పార్టీ గీత దాటితే.. కఠిన చర్యలుంటాయన్నారు.

Add Zee News as a Preferred Source

అంతే కాకుండా.. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకున్నారు. అంతే కాకుండా.. మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు.. మున్నురు కాపు నేతలతో తన నివాసంలో నిర్వహించిన సమావేశంపై కూడా సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త ఇన్ చార్జీ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. అయితే.. తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ఇన్ చార్జీ మారడం అంటే.. సీఎం మార్పు కూడా ఖాయమన్నారు. మీనాక్షి నటరాజన్ వచ్చింది.. డిసెంబర్ వరకు సీఎం రేవంత్ ను పీఠం దించుతారని జోస్యం చెప్పారు.  ప్రస్తుతం తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా మారిపోయిందన్నారు.

Read more: IIT Baba Video: గంజాయితో దొరికి పోయిన ఐఐటీ బాబా.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు.. వీడియో వైరల్..

మరోవైపు సీఎం పీఠంపై.. ఇప్పటికే మల్లు భట్టీ విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి ఒక కన్ను వేసి ఉన్నారని అన్నారు. డిసెంబర్ నాటికి సీఎం రేవంత్ కుర్చి దిగడం ఖాయమన్నారు. తెలంగాణలో సీఎం సీటులో ఉండాలంటే.. ఇక్కడి ఆడబిడ్డల ఆశీర్వాదం కంటే.. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు ముఖమన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News