Adilabad CCI: కేటీఆర్‌ తీవ్ర విమర్శలు.. 'బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం'

KTR Opposes Plan To Sell CCI Assets Adilabad: తెలంగాణలో ఉన్న కొద్ది పరిశ్రమలు కాస్త మూతపడుతుండగా మరో ఫ్యాక్టరీ కూడా మూతపడేందుకు సిద్ధమవుతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆదిలాబాద్‌ సీసీఐ ఫ్యాక్టరీపై మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 4, 2025, 07:11 PM IST
Adilabad CCI: కేటీఆర్‌ తీవ్ర విమర్శలు.. 'బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం'

Adilabad CCI Factory: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తుక్కు కింద తెగనమ్మేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గమని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న బీజేపీ ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలని చూడడం ప్రజలను వంచించడమేనని మండిపడ్డారు. బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం అని విమర్శించారు.

Add Zee News as a Preferred Source

Also Read: Banakacherla Project: గురువు చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. బనకచర్లపై అభ్యంతరం

సీసీఐ ఫ్యాక్టరీని మూసివేస్తున్నారని ప్రచారంతోపాటు కంపెనీ యంత్రాలు విక్రయించడానికి టెండర్లు పిలవడంపై కేటీఆర్‌ కీలక ప్రకటన విడుదల చేశారు. సీసీఐ ఫ్యాక్టరీని మూయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆ కంపెనీని తిరిగి ప్రారంభించాలని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు, వారి ఆర్తనాదాలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ సంస్థను అంగడి సరుకుగా మార్చే పాపం మోడీ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు. సీసీఐకి చెందిన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్కకట్టి ఆన్‌లైన్‌లో అమ్మడానికి టెండర్లు పిలవడం బీజేపీ ప్రభుత్వ దొంగతనానికి నిదర్శనం అని పేర్కొన్నారు.

Also Read: Kavitha Womens Day: 'మార్చి 8న ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేయాలి'

నిర్మాణ రంగంలో సిమెంట్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సీసీఐని పునఃప్రారంభించాలని.. కార్మికులను ఆదుకోవాలని తాము ఎన్నోసార్లు కేంద్ర మంత్రులను కోరినట్లు మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. అయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం కనికరించకపోవడం ఆదిలాబాద్ ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్లేనని కేటీఆర్ మండిపడ్డారు. సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు తామ నిరంతరం కృషి చేసినట్లు చెప్పారు. ప్రధాని మోదీతో పలుమార్లు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారని కేటీఆర్‌ వివరించారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండే, పీయూష్ గోయల్‌లను పలుమార్లు కలిశానని..పలుసార్లు లేఖలు కూడా రాసినట్లు కేటీఆర్ వెల్లడించారు.

ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినా ప్రధాని మోదీ నుంచి సానుకూల స్పందన రాలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో తెరుస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు స్క్రాప్‌గా అమ్మేందుకు ప్రయత్నించడం ఆదిలాబాద్ ప్రజలకు చేసిన మోసమేనని కేటీఆర్ ఆరోపించారు. సీసీఐ ఫ్యాక్టరీని మూసివేసే ప్రక్రియను వెనక్కి తీసుకునే వరకు కార్మికులతో కలిసి ఉద్యమిస్తామని.. సంస్థ పరిరక్షణ కోసం పోరాడతామని కేటీఆర్ ప్రకటించారు.

కంపెనీ వివరాలు
పేరు: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)
ఎక్కడ: ఆదిలాబాద్‌
విస్తీర్ణం: 772 ఎకరాల భూమి
టౌన్‌షిప్‌: 170 ఎకరాలు
48 మిలియన్ టన్నుల లైమ్‌స్టోన్ నిల్వలతో సకల వనరులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News