DK Aruna: 'ఎన్నికల్లో ఇచ్చిన 420 హమీలను అమలు చేయడంలో రేవంత్‌ రెడ్డి విఫలం'

Revanth Reddy 420 Promises Fails Says DK Aruna In Kamareddy Campaign: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 420 హామీల అమలులో రేవంత్‌ రెడ్డి విఫలమయ్యారని.. ప్రజలందరినీ మోసం చేశారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం అని ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 24, 2025, 08:17 PM IST
DK Aruna: 'ఎన్నికల్లో ఇచ్చిన 420 హమీలను అమలు చేయడంలో రేవంత్‌ రెడ్డి విఫలం'

Revanth Reddy 420 Promises: ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం, రేవంత్‌ రెడ్డి విఫలమయ్యారని.. 420 హామీలు నెరవేర్చలేదని బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కేసీఆర్‌ను మించి రేవంత్‌ రెడ్డి అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. అనుభవం లేని పరిపాలన రేవంత్‌ రెడ్డిది అని అభివర్ణించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: Anjan Kumar Yadav: 'కొడుకులు.. భజనగాళ్లు' అంటూ రెడ్డిలపై రెచ్చిపోయిన మాజీ ఎంపీ

పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సోమవారం మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఎంపీ అరుణ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించారని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు సూచించారు.

Also Read: BRS Party Joinings: ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి వలసలు

కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని గుర్తుచేశారు. ప్రజలకు ఇచ్చిన 420 హమీలను అమలు చేయడంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు‌. కానీ కేంద్ర ప్రభుత్వం పేదలకు.. మధ్య తరగతి ప్రజలకు భారీగా ప్రయోజనం అందించిందని వివరించారు. ఎవరూ ఊహించని విధంగా మధ్యతరగతి వారికోసం అదాయ పన్నులో ప్రధాని మోదీ మినహాయింపు ఇచ్చారని ఎంపీ అరుణ చెప్పారు.

తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ఎంపీ అరుణ ధీమా వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీలో చిక్కుకున్న ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్టంలో అమలు అవుతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని గుర్తుచేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News