
Bollywood Actress Rape : హైదరాబాద్ లో బాలీవుడ్ నటిపై దాడి జరిగింది. పోలీసుల సక్రమంగా విధులు నిర్వహించపోవడంతో పాటు డ్యూటీలో అలక్షం వల్ల కొన్ని దారుణ సంఘటనలు జరిగిపోతున్నాయి. మరోవైపు క్రైమ్ కు పాల్పడే వాళ్లకు పోలీసుల నిర్లక్ష్యమే వారికి వరంగా మారుతోందనే టాక్ ప్రజలను నుంచి వ్యక్తమవుతోంది. తాజాగా ముంబయిలో ఉంటున్న ఓ బాలీవుడ్ నటిని ఓ షాప్ ప్రారంభోత్సవం కోసం అతిధిగా రావాలని పిలిపించారు. ఆమెకు మాసబ్‌ట్యాంక్ శ్యామ్ నగర్‌కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో బస ఏర్పాటు చేశారు.
అంతేకాదు ఈమెకు అక్కడ ఓ వృద్ధురాలిని కూడా నటికి అవసరమైన వసతులు ఏర్పాటు చేసే బాధ్యత అప్పగించారు. ఆ తరువాత ఇద్దరు మహిళలు నటి ఉన్న అపార్ట్మెంట్లోకి వెళ్లి తమతో కలసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. ఆ తరువాత ముగ్గురు పురుషులు వచ్చి నటిని బలవంతం చేశారు.
ఆమె ఎదురు తిరగడంతో ఆమెపై దాడి పాల్పడ్డారు. బాధితురాలు గట్టిగా అరవడంతో వారు అక్కడ నుంచి పరారయ్యారని తెలుస్తోంది. వృద్ధురాలు, ఇద్దరు మహిళలు నటిని గదిలో బంధించి రూ. 50 వేల డబ్బుతో పలాయనం చేసినట్టు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe