Karimnagar: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి తల్లిపై హత్యాయత్నం.. వీడియో వైరల్..

Boy murder attempt in Karimnagar: యువకుడు ప్రియురాలి తల్లిపై కూర్చుని ఆమె పీకను బలవంతంగా ఊపిరాడకుండా పిసికి పట్టుకున్నాడు. దీంతో ఆమె బాధతో విలవిల్లాడిపోయింది. ఈ ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 2, 2025, 08:07 PM IST
  • ప్రియురాలి తల్లిపై హత్యయత్నం..
  • కరీంనగర్ లో యువకుడి దారుణం..
Karimnagar: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి తల్లిపై హత్యాయత్నం.. వీడియో వైరల్..

Boy brutally attacks  on girl friend mother in karimnagar: చాలా మంది  యువత ప్రేమ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దల కుదిర్చిన పెళ్లిళ్లకన్న ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే..కొంత మంది మాత్రం ప్రేమను తమ అవసరాలకు పావుగా వాడుకుంటున్నారు. తమ అవసరాలు ఉన్నంత సేపు ప్రేమిస్తున్నామని చెప్పి, అవతలి వారితో మంచిగా ఉంటున్నారు.

Add Zee News as a Preferred Source

 

ఇక తమ పని అయిపోయిందంటూ అసలు రంగు బైటపెడుతున్నారు. మరికొందరు కొన్నిరోజుల పాటు ప్రేమాయణం నడిపించి.. వీరి కన్న బెటర్ గా ఉన్న వాళ్లు తగిలితే.. వీళ్లను వదిలేసి వాళ్లతో దుకాణం తెరుస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది ప్రేమలో మోసపోయి ప్రేమోన్మాదులుగా మారిపోతున్నారు. ప్రేమించిన వాళ్లను చంపడం లేదా చావడం చేస్తున్నారు.ఇంకా కొంత మంది తమ ప్రేమను అంగీకరించకపోతే.. తల్లిదండ్రుల్ని సైతం.. హత్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇలాంటి ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. 

రామడుగు మండలం వన్నారానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి ఓ యువతి ఇద్దరు ప్రేమించుకున్నారు. కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుంది. కానీ యువతి తల్లి చామంతికి మాత్రం ఈ పెళ్లి ఇష్టంలేదు.  తన కూతురుకి మరో సంబంధం చూసింది.  మార్చి నెలలోనే మరొకరితో పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. ఇంట్లో వాళ్లు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అప్పటి నుంచి యువతి .. ఆమె ప్రియుడ్ని దూరంగా ఉంచింది.

Read more: Viral Video: రెడ్ లైట్ ఏరియాగా మారిన హైదరాబాద్..?.. రాత్రిళ్లు బిందాస్‌గా ట్రాన్స్ జెండర్‌ల గలీజ్ దందా.. వీడియో వైరల్..

దీంతో ప్రియురాలి తల్లిపై అతను పగ పెంచుకున్నాడు. ఈరోజు ఏకంగా ఆమె దగ్గరకు వెళ్లి ఆమె మీద కూర్చుని, పీక పిసికి చంపేందుకు ప్రయత్నించాడు. ఆమె రక్తం కూడా కక్కుకుంది. యువతి అతడ్ని వారిస్తున్న కూడా అతను వినలేదు. వీరి అరుపులకు చుట్టుపక్కల వారు వచ్చి.. యువకుడ్ని విడిపించారు. ఈ ఘటన తర్వాత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్ కుమార్ ను అరెస్ట్ చేశారు.  ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News