Jagadish Reddy Suspend: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ తప్పిదాలను తిప్పి కొడుతూ.. చట్టసభలో నిలదీస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ సభ్యుడు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు. అకారణంగా.. చేయని తప్పునకు జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారని బీఆర్‌ఎస్ పార్టీ వాదిస్తోంది. స్పీకర్‌ను అవమానించారనే ఆరోపణతో ఉప ముఖ్యమంత్రి మొదలుకుని.. మంత్రులు, అధికార పార్టీ సభ్యులు నానా హంగామా చేశారు. ఆఖరకు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు.
Also Read: KT Rama Rao: రేవంత్ రెడ్డి మానసిక ఆరోగ్యంపై కేటీఆర్ ఆందోళన.. కుటుంబీకులకు కీలక విజ్ఞప్తి
'ఈ సభ ఒక్కరిది కాదు.. అందరిది' అని బీఆర్‌ఎస్ పార్టీ సభ్యుడు జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో వివాదం రేపారు. అకస్మాత్తుగా సభను వాయిదా వేసి అనంతరం పునఃప్రారంభించిన తర్వాత జగదీశ్ రెడ్డిపై అధికార సభ్యులు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క్ జగదీశ్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయడానికి ఎథిక్స్ కమిటీకి పంపాలి' డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు.
Also Read: Revanth Reddy: 'కేసీఆర్ చేయనన్ని పాలసీలు నేను చేశా.. ఫొటోలు దిగాల్సిన అవసరం లేదు'
అంతకుముందు సీతక్క మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో ఉంది. స్పీకర్ చైర్‌ను ఒక వ్యక్తిలాగా కాకుండా వ్యవస్థ లాగా చూడాలి' అని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చాలా అవమానాలు ఎదుర్కొన్నామని చెప్పారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు అట్టడుగు వర్గాలను అవమానించే విధంగా మాట్లాడారన్నారు. 'జగదీశ్ రెడ్డి మాటలపై అన్ని రికార్డులు పరిశీలించాం. గవర్నర్‌ను కాంగ్రెస్ కార్యకర్తగా పిలిచి అవమానించారు. అప్పుడు మహిళా గవర్నర్, నిన్న ట్రైబల్ గవర్నర్, ఇప్పుడు స్పీకర్ ను అవమానించారు' అని సీతక్క వివరించారు.
'బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక నిబంధనలు కొత్తగా తీసుకొచ్చారు. గతంలో మమ్ముల్ని పోడియం వద్దకు కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. దళిత వర్గాలకు చెందిన స్పీకర్‌ను టార్గెట్ చేయడం మంచిది కాదు. జగదీశ్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి' అని సీతక్క డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









