)
Brs activists burns Kavitha flexi video: తెలంగాణాలో ప్రస్తుతం రాజకీయాలు వర్షాకాలంలో హీటెక్కాయి. ఒకవైపు కాళేశ్వరం వివాదం, మరోవైపు కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన కామెంట్స్ తెలంగాణలో కాక రాజేశాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణకు అప్పగిస్తామని రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత నిన్న ( మంగళ వారం) రియాక్ట్ అయ్యారు. అంతే కాకుండా.. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోకుమార్ లపై నిప్పులు చెరిగారు. అసలు వీళ్ల వల్లనే కేసీఆర్ కు చెడ్డపేరు వచ్చిందన్నారు.
కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు
హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన
హరీశ్ రావు పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు
కవిత బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం
పార్టీ నాయకులను… pic.twitter.com/PLysaPgvxo
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2025
తనపై కుట్రలు కూడా చేసింది హరీష్ రావు, సంతోష్ కుమార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ చుట్టు దెయ్యాలు ఉన్నాయని ఇన్ డైరెక్ట్ గా అన్న కవిత ప్రస్తుతం మాత్రం.. నేరుగా హరీష్ రావు, సంతోష్ కుమార్ ల పేర్లు తీసుకొవడం పెద్ద దుమారం రాజేసింది. దీనిపై బీఆర్ఎస్ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో నిన్నటి నుంచి కేసీఆర్ నివాసంలో దీనిపై సమాలోచనలు జరిపారు.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కవిత పోస్టర్లు, బ్యానర్లు తీసేస్తున్న పార్టీ శ్రేణులు pic.twitter.com/2MmIdFpmp0
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2025
అందరు అనుకున్నట్లే బీఆర్ఎస్ పార్టీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరొవైపు.. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ ఆఫీసుల నుంచి కవిత ఫోటోల్ని బీఆర్ఎస్ కార్యకర్తలు తీసేశారు.
హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టి, హరీశ్ రావు పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేశారు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహంవ్యక్తం చేశారు.
పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే సొంత కూతురి పైన కూడా చర్యలు తీసుకోడానికి వెనకాడని కేసీఆర్ నిర్ణయాలు అభినందనీయమంటూ.. జుక్కల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మొత్తంగా కవిత ఎపిసోడ్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.