Harish Rao Emotional Video: చిన్నారి స్పీచ్ విని కంట తడి పెట్టుకున్న హరీష్ రావు.. ఎమోషనల్ వీడియో..

Brs ex minister harish rao emotional: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట్ లో స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో చిన్నారీ స్పీచ్ విని ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 19, 2025, 07:18 PM IST
  • ఎమోషనల్ అయిన హరీష్ రావు..
  • చిన్నారిని ఓదార్చిన ట్రబుల్ షూటర్..
Harish Rao Emotional Video: చిన్నారి స్పీచ్ విని కంట తడి పెట్టుకున్న హరీష్ రావు.. ఎమోషనల్ వీడియో..

Harish rao emotional after girl speech in siddipet video: చిన్నపిల్లల్ని దేవుళ్లతో సమానం అంటారు. అందుకే చాలా మంది తమ పిల్లల్ని ఎంత కష్టపడి అయిన మంచి స్కూళ్లలో చదివించడానికి తెగ ప్రయత్నాలు చేస్తారు. తమ బిడ్డకు మంచి చదువు నేర్పించాలని,జీవితంలో ఒక గొప్ప స్థానానికి ఎదగాలని కూడా తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు, త్యాగాలు చేస్తుంటారు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో కొంత మంది పగలనక, రాత్రనక తమ పిల్లల కోసం పడరానిపాట్లు పడుతారు. ఇదిలా ఉండగా.. చిన్నారులు సైతం.. తమ తల్లిదండ్రులు చెప్పినట్లు కష్టపడి చదువుకుంటారు.అయితే.. తల్లిదండ్రులు కూడా రెండు జోడెద్దుల లాంటి వారని చెప్తుంటారు. వీళ్లలో ఏ ఒక్కరు లేకున్న కూడా  అలాంటి ఇల్లుచాలా కష్టాలు ఫెస్ చేయాల్ని ఉంటుందంటారు. 

 

తాజాగా.. సిద్దిపేటలో  "భద్రంగా ఉండాలి- భవిష్యత్ లో ఎదగాలి" పేరుతో పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులకు మోటీవేషన్ తరగతులు నిర్వహించారు. దీనికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హజరయ్యారు.

 అప్పుడు ఒక చిన్నారి వచ్చి తన తండ్రిచిన్నప్పుడు చనిపోయారని.. తన తల్లి ఎంతో కష్టాలు పడుతూ చదివిస్తుందని తండ్రిని గుర్తు చేసుకునిమరీ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో హరీష్ రావు ఒక్కసారిగా ఆ చిన్నారిని ప్రేమతో హత్తుకున్నారు.

Read more: Smita Sabharwal: నన్ను స్పెషల్‌గా టార్గెట్ చేస్తున్నారా..?.. పోలీసులకు ఇచ్చిపడేసిన స్మిత సబర్వాల్.. సంచలనంగా మారిన పోస్ట్..

అంతేకాకుండా.. ఆ మాటలు విని ఒక్కసారిగా భావోద్వేగానికి సైతం గురయ్యారు. కన్నీళ్లు తుడుచుకుంటూ.. యువతిని సైతం ప్రేమతో ఓదార్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకొవడం చూసి అభిమానులు సైతం చాలా ఎమోషనల్ అవుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News