BRS KTR Video: బిడ్డా.. రేవంత్ నువ్వు తగ్గాల్సిందే..!.. హెచ్‌సీయూ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. వీడియో వైరల్..

ktr on kancha Gachibowli land issue: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్‌సీయూ వివాదంపై మాట్లాడారు. ఈ క్రమంలో ఈ భూముల్ని ఎవరు కొనొద్దని మాస్ ధమ్కీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఆ భూమిని అందమైన ఎకోపార్క్ గా తీర్చి దిద్ది హెచ్‌సీయూకు కానుకగా ఇస్తామన్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 3, 2025, 11:34 AM IST
  • మళ్లీ రెచ్చిపోయిన కేటీఆర్..
  • హైదరాబాద్ ఘటననపై కీలక వ్యాఖ్యలు..
BRS KTR Video: బిడ్డా.. రేవంత్ నువ్వు తగ్గాల్సిందే..!.. హెచ్‌సీయూ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. వీడియో వైరల్..

ktr on kancha gachibowli land controversy: తెలంగాణలో ప్రస్తుతం  హెచ్‌సీయూ భూముల వివాదం సమ్మర్ లో మరింత నిప్పులు రాజేస్తుంది. ఇప్పటికే ఒక వైపున విద్యార్థులు  హెచ్‌సీయూ నుంచి వెంటనే ప్రభుత్వం బలగాలు, జేసీబీలను పంపించివేయాలని ధర్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాల వల్ల మూగజీవాలు బలౌతున్నాయని అన్నారు. ఈ  హెచ్‌సీయూ వివాదం కాస్త పోలిటికల్ టర్న్ తీసుకుంది. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనీవర్సీటీ వివాదంపై తెలంగాణ హైకోర్టులో  ఇప్పటికే పలు పిటిషన్ లు సైతం దాఖలయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం హెచ్‌సీయూ వివాదంపై తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Add Zee News as a Preferred Source

 

సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తామని చెప్పి, 420 హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా..అంటూ మండిపడ్డారు. ఇచ్చిన హమీలు ఎక్కడ అని ప్రశ్నిస్తే.. అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్నారు. ఇక హెచ్‌సీయూ వివాదంపై మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీకోసం పచ్చగా ఉన్న హెచ్‌సీయూలో అడవులపై సీఎం రేవంత్ దురాగతాలు చేస్తున్నారన్నారు. రాత్రికి రాత్రే బుల్డొజర్ లో అడవుల్లోని చెట్లను నరికేయాల్సిన అవసరం ఏముందన్నారు. ఇన్నేళ్లుగా అక్కడ ఉన్న నోరులేనీ జీవాలు, జంతుజాలాలు కన్నీళ్లతో ఆక్రందనలు చేస్తున్నాయన్నారు. సీఎం రేవంత్ ఎట్టి పరిస్థితుల్లోను తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొవాలన్నారు.

అదే విధంగా ఈ భూముల్ని ఎవరు కొనకూడదని హుకూం జారీ చేశారు. అంతే కాకుండా.. ఎవరైన కొంటే మాత్రం తీవ్రంగా నష్టపోతారని.. ఫ్యూచర్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి భూముల్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. హెచ్‌సీయూలో ఉన్న 400 ఎకరాలను పచ్చగా ఎకో పార్క్ గా అందంగా తీర్చిదిద్ది.. హెచ్‌సీయూకు కానుకగా ఇస్తామన్నారు. సీఎం రేవంత్ ప్రభుత్వం హెచ్‌సీయూ భూములపై మాత్రం వెంటనే వెనక్కు తగ్గాలని లేకపోతే.. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు.

Read more: Rashmika Mandanna: మీరు చేస్తుంది కరెక్ట్ కాదు.. హెచ్​‌సీయూ ఘటనపై చివాట్లు పెట్టిన రష్మిక మందన్న..!.. సంచలనంగా మారిన పోస్ట్..

దీనిపై ఎట్టిపరిస్థితుల్లో కూడా వెనక్కు తగ్గేదిలేదన్నారు.  ఫ్యూచర్ సిటీకోసం 14 వేల ఎకరాలు ఉండగా.. హెచ్‌సీయూలోని 400 ఎకరాలల్లో ఉన్న భూమి మాత్రమే ఎందుకని ప్రశ్నలు సంధించారు. గతంలో బీఆర్ఎస్ హరితహరం చేపట్టి మొక్కలను పైలట్ ప్రాజెక్ట్ గా నిర్వహించడం వల్ల ఈ మాత్రమైన పచ్చదనం ఉందన్నారు.  తమ వల్లనే హైదరాబాద్  కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన విషయంను సైతం కేటీఆర్ గుర్తు చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News