Brs ktr reacts on Telangana panchayat elections results 2025: తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్దం పీక్స్ కు చేరింది. అంతే కాకుండా.. నేతల మధ్య ఇటీవల మాటల తూటాలు పేలుతున్నాయి. మొత్తంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తాము బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదిపాయి. ఈ క్రమంలో ప్రస్తుతం తొలిదశ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. కొన్నిచోట్ల చెదురు మదురు సంఘటనలు తప్ప మొత్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
అయితే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ తొలిదశ పంచాయతీ పోరులో విజయం సాధించిన సర్పంచ్ , వార్డు మెంబర్ లకు ప్రత్యేకంగా విషేస్ చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి ప్రజల మనస్సులు గెల్చుకుని విజయం సాధించిన సర్పంచులుగా, వార్డుమెంబర్లకు, బీఆర్ఎస్ మద్దతుదారులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రే పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టారన్నారు. అంతే కాకుండా.. పోటీచేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్ దాటకపోవడం ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమంటూ ట్విట్ చేశారు.
పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ..ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించారన్నారు. రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఎన్నికల ఫలితాలతో బైటపడిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని కూడా తొలిదశ పంచాయతీ ఫలితాలతో స్పష్టంగా తెలిసిపోయిందన్నారు. వచ్చే మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పల్లెల్లో పైసా అభివృద్ధి పని జరగదని, గ్రామస్థులు నిర్ధారణకు రావడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఇంతటి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని కేటీఆర్ అన్నారు.
సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవకపోవడం, అనేక చోట్ల 10, 20 ఓట్ల తేడాతోనే బయటపడటం చూస్తే కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైనట్టు స్పష్టంగా తెలుస్తొందని కేటీఆర్ అన్నారు.
రెండేళ్లు గడిచినా ఆరు గ్యారెంటీల పేరిట చేసిన సీఎం రేవంత్ మోసం, పెన్షన్ల పెంపు పేరిట చేసిన ద్రోహం, మహాలక్ష్మి పేరిట చేసిన దగా, తులం బంగారం పేరిట చేసిన నయవంచనను గ్రామీణ ప్రాంత ప్రజలు మరిచిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయని కేటీఆర్ అన్నారు. యూరీయా కోసం రైతుల అగచాట్లు, బోనస్ అంటూ రైతన్నలకు మోసాలు, చివరకు పంటను పండించిన రైతులు అమ్ముడు పోక తీవ్రఇబ్బందుల్ని ఎదుర్కొన్నారన్నారు.
పదేళ్ల పాటు ప్రగతి పథంలో ముందుకు వెళ్లిన తెలంగాణ ప్రస్తుతం గాడితప్పిందన్నారు. ఇది ఆరంభం మాత్రమే, పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యమంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా సంచలన ట్విట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









