)
ktr fires on revanth reddy govt amid jubilee hills by elections video: తెలంగాణలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రచ్చ నడుస్తొంది. అన్నిపార్టీలు కూడా తమదైన శైలీలోపావులు కదుపుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికలు ఊపందుకున్నాయి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన షేక్‌పేట్ డివిజన్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చెర్క మహేష్ బీఆర్ఎస్ లోకి చేరారు.
మీకు కారు కావాలా.. బుల్డోజర్ కావాలా
కాంగ్రెస్ వాళ్ళు వచ్చాక ఏం చేశారు అంటే.. గరీబ్ వాళ్ల ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడికి బుల్డోజర్ మాత్రం పంపించారు
హైడ్రా అని కొత్త దుకాణం పెట్టి ఉన్న ఇల్లు కూలగొడుతున్నాడు
మీకు కారు కావాలి అంటే బీఆర్ఎస్ గెలవాలి.. గోపీనాథ్ భార్య సునీత గెలవాలి
మీ… pic.twitter.com/0VvqdhaOOQ
— Telugu Scribe (@TeluguScribe) October 12, 2025
ఈ క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలన్నారు. ఎన్నికల్లో బుద్ధి చెపితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తదన్నారు.
రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్ లో ఖర్చుపెడతారు.. కాంగ్రెస్ పార్టీ ఓటుకు 10000 ఇస్తుందన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పనికిరాని పార్టీ అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలి అంటే కేసీఆర్ తిరిగి సీఎం కావాల్సిందే నంటూ స్పష్టం చేశారు. అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాల్సిందేనని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు జూబ్లిహిల్స్ లో ఓడిస్తే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హమీలపై కాంగ్రెస్ కు బుద్ది వస్తుందన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు 4 వేల పెన్షన్లు వస్తాయని, ఎన్నికల కోసం చెప్పిన హామీలన్నీ అమలు అవుతాయన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, ప్రజలను తాము మోసం చేసినా కూడా మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందన్నారు. ఆరు గ్యారంటీలు చెప్పి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు.
అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. ఈ రెండు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు. ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, కానీ రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పుల్ని మాత్రం చేసిందన్నారు.
గరీబోళ్ల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి, హైదరాబాద్‌లో ఇళ్లు కూలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డిని అని ఏకీపారేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలన్నారు. కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదవాళ్ళ ఇండ్లపైన బుల్డోజర్లను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నదన్నారు.
అన్నీ తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి మోసం చేశాడన్నారు. పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని తెలుసు. ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేస్తుందని కూడా తెలిసి మరీ బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేశాడన్నారు.
అజారుద్దీన్‌కు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్సీ కూడా ఆయనకు రాదని తెలుసు, కానీ ఆయనను కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ముస్లింలకు ఇస్తామని చెప్పిన స్మశానం విషయంలో కూడా మోసం చేశారన్నారు.
తెలిసి మరీ ప్రజలను మోసం చేయడమే రేవంత్ రెడ్డి నైజమన్నారు. ఆయన నిజాయితీగా చెబుతూ మరీ మోసం చేస్తున్నాడన్నారు. ఆయన గతంలోనే ' మోసం చేసే వాళ్ళనే ప్రజలు నమ్ముతారని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన విషయంను గుర్తు చేశారు.
రెండు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క పని చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కేవలం కేసీఆర్ గారి నామం జపం చేసి కాంగ్రెస్ కాలం గడిపేసిందని కేటీఆర్ ఎద్దేవాచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook