)
Brs ktr satires on cm revanth reddy on jubilee hills by elections: జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం జోరును పెంచాయి. ఇప్పటికే వివిధ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరోకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని బీజేపీ ఆరోపణలు చేస్తుంది.
రేవంత్ రెడ్డి ఏదో యుద్ధం చేసి గెలిచిన చక్రవర్తి లెక్క ఫీల్ అవుతున్నాడు
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే సంక్షేమ పథకాలను కట్ చేస్తా అని ఓటర్లను బెదిరిస్తున్నాడు
ఆయన అట్ల బెదిరిస్తే.. ఓటర్లు ఆయన తోక కట్ చేస్తారు –కేటీఆర్ pic.twitter.com/ZTdxd54FX1
— Telugu Scribe (@TeluguScribe) November 1, 2025
అదే విధంగా కాంగ్రెస్, బీజేపీలది బడేమియ్యా, ఛోటేమియ్యా బంధం అంటూ బీఆర్ఎస్ ఏపీపారేస్తుంది. జూబ్లిహిల్స్ లో ఎలాగైన తమ పార్టీ జెండా ఎగురవేయాలి అన్ని ప్రధాన పార్టీలు తమదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై పంచ్ లు వేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఏదో యుద్దంలో గెల్చి నట్లు ఫీల్ అవుతున్నాడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే సంక్షేమ పథకాలను కట్ చేస్తా అని ఓటర్లను బెదిరిస్తున్నాడన్నారు.
ఎన్నికల ప్రచారంలో నోటికి ఎంతోస్తే అంత మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజలకు ఇచ్చిన 420 హమీలు నెరవేర్చలేదన్నారు.
అదే విధంగా.. మూడు ఫీట్ల మనిషివి నువ్వెంత.. ప్రజలు ఎన్టీఆర్ అంతని గొప్ప నేతను సైతం ఓడించరి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు.. ఓటర్లు భయపడే రోజులు లేవన్నారు. అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి తోక కట్ చేసి ప్రజుల ఇంట్లో కూర్చుండబెడతారంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.