KTR Vs Revanth Video: నాకు రంకులు అంటకట్టింది మీరు.. అసెంబ్లీలో రెచ్చిపోయిన కేటీఆర్.. వీడియో వైరల్..

ktr fires on cm revanth reddy: కేటీఆర్ అసెంబ్లీలో సీఎం రేవంత్ పై మళ్లీ రెచ్చిపోయారు. నువ్వేమన్న స్వాతంత్ర సమరయోధుడివా అంటూ ఏకీపారేశారు. దీంతో సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం పీక్స్ కు చేరింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 27, 2025, 06:21 PM IST
  • రెచ్చిపోయిన కేటీఆర్..
  • అసెంబ్లీలో రేవంత్ పై సెటైర్ లు..
KTR Vs Revanth Video: నాకు రంకులు అంటకట్టింది మీరు.. అసెంబ్లీలో రెచ్చిపోయిన కేటీఆర్.. వీడియో వైరల్..

KTR Fires on cm revanth reddy video: తెలంగాణలో రాజకీయాలు రసవత్తంగా మారాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య రాజకీయాలు సమ్మర్ లో హీట్ ను మరింతగా పెంచేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. దీనిలో బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతల మధ్య మాటలు పీక్స్ కు చేరిపోయాయి. ఎవరు కూడా ఏమాత్రం తగ్గెదేలే అన్న విధంగా ఆరోపణలు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో సీఎం రేవంత్ సభలో మాట్లాడుతు..తనను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డ్రోన్ ఎగిరేసేన ఘటనలో జైలులో పెట్టారని అప్పటి ఘటనను గుర్తు చేసుకున్నారు. తనను 16 రోజులు జైలులో ఉంచారన్నారు.

Add Zee News as a Preferred Source

నక్సలైట్ లు, కరుడు గట్టిన ఉగ్రవాదుల్ని ఉంచిన బ్యారెక్ లో పెట్టారన్నారు. తనకు రాత్రి పూట ట్యూబ్ లైట్ ఆఫ్ చేయకుండా.. కావాలని నిద్రలేకుండా చేశారన్నారు. బాత్రూమ్ కు వెళ్తే అంత బైటకు కనపడేలా ఉంటుందన్నారు. ఉదయం పూట.. చెట్టు కింద పడుకునే వాడ్నని రేవంత్ గతంలో అనుభవించిన తన జైలు జీవితం గురించి అసెంబ్లీలో మాట్లాడారు. మరోవైపు దీనిపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ ఏదేదో మాట్లాడుతున్నారని.. ప్రభుత్వాలు వ్యక్తుల్ని జైల్లో పెట్టవని.. అవి కోర్టుల పని అన్నారు.

 

 

రేవంత్ చేసిన తప్పుకు కోర్టు రిమాండ్ విధించిదన్నారు.దీనిలో తమకు ఎలాంటి సంబంధంలేదన్నారు. గతంలో రేవంత్ తమ కుటుంబాలకు చెందిన వాళ్ల మీద, ఆడవాళ్ల మీద, మైనర్ పిల్లల్ని సైతం వదలకుండా ఇష్టమున్నట్లు మాట్లాడారని.. గుర్తుచేశారు. మీ ఇంట్లోనే మహిళలు ఉంటారా..?.. ఇతరుల ఇళ్లలో మహిళలు కారా.. అంటూ ఏకీపారేశారు. తనకు అప్పట్లో ఇతరులతో రంకు అంటకట్టారని..కూడా అప్పట్లో కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్ని కేటీఆర్ సభలో అందరి ముందు బైటపెట్టారు.

Read more: Pawan Kalyan: పవన్ ఇలాఖాలో బూతు స్టెప్పులతో అమ్మాయిల రచ్చ రంబోలా.. షాకింగ్ వీడియో..   

డ్రోన్ లను తమ ఇంటి మీద వదిలారని.. ఇది ఎంత వరకు సమంజసం అన్నారు. రేవంత్ ఏవేవో మాట్లాడుతున్నారని.. ఆయన ఫ్రస్టేషన్ లో ఉన్నాడని.. సీఎం పదవి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్టేషన్ ఉన్న వ్యక్తిని చూడటం ఇదే తొలిసారి అన్నారు. రేవంత్ ఇలా మాట్లాడటమే తమకు కావాలని...ఇది లాస్ట్ సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడమన్నారు. రేవంత్ భాషను చూస్తే.. జనాలంతా.. కాంగ్రెస్ పార్టీ చెబితేనే భయపడిపారిపోతున్నారని కేటీఆర్ రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News