)
ktr slams on revanth reddy over almatti dam row in achampet meeting: తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఒక వైపు స్థానిక సంస్థల ఎన్నికలపై, బీసీ రిజర్వేషన్ అంశంపై హైకోర్టు ఆదేశాలతో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి సర్కారును ఇచ్చిన హమీలపై కార్నర్ చేస్తునే ఉంది. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల బాకీలను ఎప్పటి కప్పుడు చెబుతూ కాంగ్రెస్ ను ముప్పు తిప్పలు పెడుతుంది.
ఆల్మట్టి కుట్రను ఆపే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా లేకపోతే బీఆర్ఎస్ సైనికులందరం వెళ్లి అడ్డుకోవాలా?
నల్లమల పులి కాదు నల్లమల గుంట నక్క, అచ్చంపేట నుండి పారిపోయి కొడంగల్ వచ్చిందని అక్కడి ప్రజలు చెప్తున్నారు
ఈసారి మేము కొడంగల్‌లో తరిమిస్తే ఆ గుంట నక్క ఎటు పోతుందో అని కొడంగల్ ప్రజలు… pic.twitter.com/XkfMbKHiTa
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2025
ఈ క్రమంలో బీఆర్ఎస్ తాజాగా.. అచ్చం పేటలో జనగర్జన పేరిట బీఆర్ఎస్ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సభకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు అన్నివిధాలుగా ఉండగా ఉండేది బీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల్ని నెరవేర్చకుంటా మోసం చేసిందన్నారు. అదే విధంగా ఆలమట్టి డామ్ వివాదంపై మాట్లాడుతూ.. ఆల్మట్టి డ్యామ్ ను అడ్డుకునే దమ్ము రేవంత్ రెడ్డికు ఉందా?.. లేదంటే ఈ గులాబీ సైనికులందరం వెళ్లి అడ్డుకోవాలా?.. అంటూ సవాల్ విసిరారు.
రాహుల్ గాంధీని కలిసి.. కర్నాటక సీఎంతో కూర్చుని మాట్లాడి.. పాలమూరు, రంగారెడ్డికి అన్యాయం జరక్కుండా ప్రాజెక్ట్ ఎత్తు పనుల్ని ఆపేలా చర్యలు తీసుకొవాలన్నారు. మరోవైపు కొడంగల్ నుంచి వచ్చిన వారు కొంత మంది రేవంత్ ను విమర్శిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. నల్లమల గుంట నక్క అంటున్నారని అన్నారు.
మరోవైపు అచ్చంపేటలో ఎవరో పార్టీ నుండి వెళ్లారని బాధ పడాల్సిన అవసరం లేదని, అంతకంటే మంచి నాయకుడిని కేసీఆర్ నిలబెడుతారని ఆ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా కోరారు. అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరవేసేలా కార్యకర్తలంత కలిసి రావాలన్నారు. అచ్చం పేట సభకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పొటెత్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి