Women fighting for Mahalakshmi Scheme Video: జుట్లు పట్టుకుని, కర్రలతో కొట్టుకున్న మహిళలు.. ఎక్స్‌లో కేటీఆర్ సంచలన ట్విట్.. వీడియో వైరల్..

Ktr tweet on women fighting for Mahalakshmi scheme  in nizamabad video: మహాలక్ష్మి పథకం కింద రూ. 2500 లబ్బులు ఇస్తున్నారంటు పుకార్లు జరిగాయి. దీంతో అమాయకులైన కొంత మంది మహిళలు డబ్బుల కోసం నిజామాబాద్ లోని పోస్టాఫీసు దగ్గరకు చేరుకున్నారు. క్యూలైన్ లలో తోపులాట జరిగింది. ఆ తర్వాత గొడవకు దిగారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.   

Written by - Inamdar Paresh | Last Updated : Aug 7, 2025, 07:15 PM IST
  • నిజామాబాద్ లో కొట్టుకున్న మహిళలు..
  • ఫైర్ అయిన కేటీఆర్..
Women fighting for Mahalakshmi Scheme Video: జుట్లు పట్టుకుని, కర్రలతో కొట్టుకున్న మహిళలు.. ఎక్స్‌లో కేటీఆర్ సంచలన ట్విట్.. వీడియో వైరల్..

Women fighting for Mahalakshmi scheme money in Nizamabad video: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు పథకంను తీసుకొచ్చింది. ఈ సదుపాయంను చాలా మంది వినియోగించుకుంటున్నారు. అయితే.. కొన్ని చోట్ల మాత్రం మహిళలు కొట్టుకుంటూ ఫైటింగ్ లకు దిగుతున్నారు. కొంతమంది సీట్ల కోసం, విండో సీట్ల కోసం ఇతరులతో వాగ్వాదంకు దిగుతున్నారు.

Add Zee News as a Preferred Source

చిన్న విషయాల్ని కూడా పెద్దదిగా చేసుకుని ఫైటింగ్ కు దిగుతున్నారు. మొత్తంగా వీరి పనుల వల్ల చాలా మంది భయంతో అసలు బస్సు ఎక్కాలంటేనే దూరంగా పారిపోతున్నారు. బస్సులో మహిళల ఫైటింగ్ లకు చెందిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. మరో చోట మహిళలు ఫైటింగ్ కు దిగారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

 

తెలంగాణలోని నిజామాబాద్ కేంద్రంలో  ఈ ఘటన సంభవించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 జమ చేస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలోని మహిళలు పోస్టాఫీసులకు పరుగులుపెట్టారు. అక్కడ  క్యూలు కట్టారు. దీంతో ముందు మేమంటే.. మేమని గొడవలకు దిగారు. ఒకర్ని మరోకరు బూతులు తిట్టుకుంటూ, ఫైటింగ్ లకు దిగారు.

 అంతే కాకుండా.. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో అకౌంట్ ఉంటేనే వస్తుందని వదంతులు రావడంతో ఆధార్ కార్డులు పట్టుకొని పోస్టాఫీసు ముందు బారులు తీరారు. దీంతో తోపులాటలు జరిగి, కొంత మంది జుట్లు పట్టుకుని, మరికొంత మంది కర్రలు పట్టుకుని ఒకరిపై మరోకరు దాడులు చేసుకున్నారు. మొత్తంగా మహిళలు బీభత్సంగా కొట్టుకున్నారు.

ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్ చేశారు. రేవంత్ సర్కారు కు మరోసారి చివాట్లు పెట్టారు.

Read more: Video Viral: మరీ ఇంత ఘోరమా..?.. వ్యూస్ కోసం భర్తకు కాళ్లులేవని చెబుతూ మహిళ వెకిలి చేష్టలు.. వీడియో వైరల్..

ఇప్పటి వరకు.. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సులో మహిళలు గొడవలు పడేలా చేశావ్.. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద మహిళలు డబ్బుల కోసం కూడా కొట్టాడుకునేలా చేశావ్.. ఇంత కన్నా మరో పాపం ఉంటుందా.. అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ప్రస్తుతం మహిళలు ఫైటింగ్ కు దిగిన వీడియో ప్రస్తుతం  నెట్టింట వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News