)
Brs Leader Rs Praveen kumar slams on revanth reddy govt: తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లిహీల్స్ బైపోల్ హాట్ టాపిక్ గా మారింది. అన్నిపార్టీలు నువ్వా ... నేనా.. అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ఈ క్రమంలో అన్నిపార్టీల నేతలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు మాత్రం రాజకీయంగా రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో తాజాగా.. బీ ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఎద్దేవా చేశారు. మొత్తంగా మానవతా విలువలు మరిచి మహిళలు, పిల్లల మీద ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారన్నారు. దుశ్శాసనులుగా కాంగ్రెస్ మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారని, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోపినాథ్ మరణంపై కాంగ్రెస్ నేతలు కాంట్రవర్సీగా మాట్లాడారన్నారు.
కేసిఆర్ గారు సునీత గారిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత, ప్రచారంలో భాగంగా సునీత భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటే..దాన్ని కూడా వక్రీకరిస్తున్నారన్నారు. తొండి చేసైనా, అవమానాలకు గురి చేసైనా గెలవాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు దారుణమని, సానుభూతి కోసం కన్నీళ్లు పెట్టుకోరని, ఇది మానవులకు సహజంగా కలిగే భావోద్వేగం అని తెలియదా? .. అంటూ ఎద్దేవా చేశారు. నాడు.. ఇందిరాగాంధీ,రాజీవ్ గాంధీ మానవ బాంబు దాడిలో చనిపోతే దేశమంతా కన్నీళ్లు పెట్టుకున్నారు కదా.. అది కూడా డ్రామానేనా పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
వై ఎస్ ఆర్ చనిపోతే అందరూ ఏడ్చు కుంటూ, కొందరు చనిపోయారు,అవి కూడా డ్రామాలేనా. అంటూ కాంగ్రెస్ నేతల్ని ఏకీపారేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దైవ నిర్ణయం అంటున్నారు. మేం వ్యక్తిగత కుటుంబ విషయాలపై కామెంట్ చేయలేమా?.. కానీ కాంగ్రెస్ లా దిగజారే పని తమది కాదన్నారు. సునీత,తన కూతురు అక్షర ఇతర కార్యకర్తలతో కలిసి 10వ తేదీన మధ్యాహ్నం 1 గం.కు మసీదు ముందు లోపలికి వెళ్లకుండా,రోడ్డు మీద బాకీ కార్డులు పంచితే నేరం ఎలా అవుతుందన్నారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ముందస్తు నోటీసు ఎందుకు ఇవ్వలేదన్నారు. డిప్యూటి తహశీల్దార్ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేశారన్నారు. సునీత,అక్షరలతో మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి..ఇతరులు అని కూడా రాసారన్నారు.
ఇతరుల పేరుతో ఎందరిని జైలుకు పంపించాలని చూస్తున్నారని ప్రశ్నలు కురిపించారు. అమ్మాయి మీద కేసు ఎలా పెడతారు?.. తల్లికి తోడుగా వెళ్లితే కేసులు పెడుతారా..?.. అంటూ ఎద్దేవా చేశారు. రోడ్డు మీద నిలబడద్దని ఏ చట్టం చెప్పింది.?.. 1988 చట్టం కింద కేసు పెట్టారు.. 223,174 బిఎన్ఎస్ ప్రకారం.. మతపెద్ద ఓటర్లను ప్రభావితం చేస్తే కేసు పెట్టాలని చెబుతుందని గుర్తు చేశారు. రోడ్ల మీద నిలబడితే ఈ సెక్షన్లు ఎలా పెడుతారంటూ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి హోం మంత్రిగా 400 పైగా బూత్ లలో, ప్రతి బూత్ కు ఒక ఇంటలిజెన్స్ అధికారిని పెట్టారన్నారు. అడుగేస్తే కేసు. చేయని నేరానికి కేసు పెట్టాలని ఆదేశించారన్నారు. రేవంత్ దిశానిర్దేశంలో పోలీసులు పక్షపాత వైఖరి చూపిస్తున్నారని ఆరొపణలు చేశారు. నవీన్ యాదవ్ ఫేక్ ఐడి కార్డు పంపిణీ చేసిన అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదు? .. నమస్తే తెలంగాణ దినపత్రిక లో వచ్చేదాక ఎవరు పట్టించుకోలే.. తర్వాత ఎన్నికల అధికారి కేసు పడితే.. 48 గంటల తర్వాత కేసు నమోదైంది.
సునీత కేసులో మొత్తం ఏడుగురు మీద కేసు పెడితే.. నవీన్ యాదవ్ ఒక్కరి మీదనే కేసు. సునీతకు ఒక న్యాయం... నవీన్ యాదవ్ కు మరో న్యాయమా? .. సునీతను అవమానించిన పొన్నం ప్రభాకర్ కు మహిళా కమీషన్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు. ఫ్రీ బస్ గురించి మాట్లాడితే కేటిఆర్ ను కమీషన్ ముందుకు పిలిచారన్నారు.
మరి పొన్నం కు ఎందుకు నోటీసులు ఇవ్వరు?.. నవీన్ యాదవ్ ఫ్లేక్సీ లో అరవింద్ గౌడ్,రేవంత్ మహేష్, రాహుల్ ఫోటోలు ఉన్నాయి. వారి మీద కేసు నమోదు చేయాలి. వారిని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలన్నారు. కేటి ఆర్ గారితో ఎన్నికల కమీషన్ ఛీఫ్ ను కలిసి ఆధారాలతో సహా ఫేక్ ఓటర్ల గురించి ఫిర్యాదు చేశారు. నిన్న కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంగా దొంగ ఓట్ల గురించి వివరించారు. అయినా అధికారులు ఇప్పటి వరకు ఎందుకు కేసులు నమోదు చేయలేదన్నారు.
కేరళ లో ఒక వ్యక్తికి రెండు ఓటరు కార్డులు ఉంటే, ఇటీవల అతనిపై ఎన్నికల కమీషన్ అధికారులు కేసు నమోదు చేశారు. నవీన్ యాదవ్ తమ్ముడు ప్రవీణ్ యాదవ్ కు 3 ఓట్లు ఉంటే, తెలంగాణ ఎన్నికల కమీషన్ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నలు కురిపించారు.
ఒకే వ్యక్తి 3 ఓట్లు కలిగి ఉండడం నేరం కాదా? .. 12000 మంది ఫేక్ ఓటర్ల విషయంలో కేసులు పెట్టరా? .. బీజేపీ కాంగ్రెస్ ఎన్నికల కమీషన్ కుమ్మక్కై బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
అయినా మాగంటి సునీత ఝాన్సీ రాణి, సమ్మక్క సారక్క, ఐలమ్మ లాగా పోరాడి విజయ దుంధుభి మోగిస్తారన్నారు. జూబ్లిహిల్స్ ప్రజలు గమనిస్తున్నారు.. తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. పొన్నం ప్రభాకర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇందిరా గాంధీ,రాజీవ్,వై ఎస్ ఆర్ చనిపోతే కన్నీళ్లు పెట్టుకున్నోళ్లందరివి డ్రామాలు సినిమా కన్నీళ్లేనా?.. హైడ్రా మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలపైకి వదిలి బూతంలా పట్టి పీడిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని ఫైర్ అయ్యారు.
మాగంటి గోపినాథ్ జూబ్లిహిల్స్ ను అద్భుతంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ మన ఇండ్లు, ప్రార్థన స్థలాలను కూలగొడుతారు. అందుకే బి ఆర్ఎస్ నె గెలిపిద్దామని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 18 న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో గ్రూప్ 2 విజేతలకు నియామక పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇది ఖచ్చితంగా జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఓటర్లను ప్రభావితం చేస్తుందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చట్ట విరుద్ధమైన చర్యగా పరిగణించాలని ఎన్నికల కమీషన్ కు సూచించారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ కి విరుద్దమన్నారు.
ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెంటనే ఈ కార్యక్రమాన్ని ఆదేశాల చర్యలు తీసుకోవాలి. నియామక పత్రాలు ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ ఇవ్వచ్చు లేదా ఉద్యోగం పొందిన అభ్యర్థులకు మెయిల్ ద్వారా పంపచ్చు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో నియామక పత్రాలు పంచి, జూబ్లిహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook