)
Harish Rao On BC Reservations: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లాగే, 42% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఒక 'డ్రామా'గా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ చేసిన కుట్రలు హైకోర్టు తీర్పుతో విఫలమయ్యాయని ఆయన అన్నారు.
55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల కోసం ఏనాడూ పోరాడలేదని ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22 నెలలుగా ఢిల్లీలో కొట్లాడకుండా, గల్లీలో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం.. 42% రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్ధత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి, ఆ అంశాన్ని పక్కదోవ పట్టించారని హరీశ్ విమర్శించారు.
బీసీల పట్ల ప్రేమ ఉన్నట్లు చూపించడానికి కేవలం తూతూ మంత్రంగా జీవో ఇచ్చి ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తన డ్రామాలు ఆపి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ పెంపు కోసం ఢిల్లీలో పోరాడాలని సవాల్ చేశారు. పార్లమెంట్లో చట్టం చేయించి, దాన్ని షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేసి, ఢిల్లీ వేదికగా యుద్ధ భేరి మోగించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడటానికి బీఆర్ఎస్ (BRS) ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఢిల్లీని నిలదీస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook