Telangana Govt: తెలంగాణలో సంచలనం.. రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు కుట్రలు..?

Telangana Politics: తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందా..! ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు ప్లాన్ వేశారా..! వీలైనంతా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారా..! ఈ విషయాన్నీ ఏకంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోటి వెంట ఎందుకు వచ్చాయి..! ఆ ఎమ్మెల్యే కామెంట్స్‌పై కాంగ్రెస్‌ సర్కార్‌ విచారణకు రెడీ అయ్యిందా..!   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 15, 2025, 09:54 PM IST
Telangana Govt: తెలంగాణలో సంచలనం.. రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు కుట్రలు..?

Telangana Politics: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు అవుతోంది. ఈ లోపే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు బీఆర్‌ఎస్ పార్టీలో నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ బలం దాదాపు 74 కు చేరుకుంది. ఈ సమయంలో బీఆర్‌ఎస్‌ కు చెందిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి.. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని హాట్‌కామెంట్స్‌ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్‌ సర్కార్‌ను బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు ఎందుకు పడగొట్టాలని భావిస్తున్నారనే ప్రశ్నలు ఎదురువుతున్నాయి.. 

Add Zee News as a Preferred Source

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు కోరుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనతో విసుగు చెందిన వారు ఖర్చు తామే భరిస్తామంటున్నారని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారని తమపై బిల్డర్లు ఒత్తిడి తెస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోయిందని, ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు దుబ్బాక నుంచి భారీగా కార్యకర్తలను తరలిస్తామని తెలిపారు.
 
ఇక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి కామెంట్స్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రజా మద్దతుతో గెలిచినా ప్రభుత్వాన్ని కూలిస్తే జనం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అసలు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోవాలని కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గత 16 నెలలుగా ప్రభుత్వం నడుస్తుంటే కాళ్లల కట్టెల అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు బీఆర్ఎస్ నేతలు పారిశ్రామిక వేత్తల దగ్గర పైసలు తెచ్చుకోవడం కొత్త విషయమేమీ కాదన్నారు. అలా అక్కడ పైసలు తీసుకొని ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.. 
 
అటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి కామెంట్స్‌పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. 10 ఏళ్లు అధికారం అనుభవించిన కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిసారి కేసీఆర్‌ నోటినుంచి వచ్చే మాటలు ఈసారి కొత్త ప్రభాకర్ రెడ్డి నోటి వచ్చాయని విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్‌ కొత్త ప్రభాకర్‌ రెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని.. అందుకే గజ్వేల్‌ నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా కూడా నియమించారని గుర్తు చేశారు. చిత్తశుద్దితో పనిచేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డనాటి నుంచి తండ్రి కొడుకులు కూల్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు..

మరోవైపు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి పై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌. పిల్లి శాపనార్థాలకు ప్రభుత్వాలు కూలిపోవని హెచ్చరించారు. వచ్చే ఐదేళ్లే కాదు.. మరో ఐదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. అటు దుబ్బాక ఎమ్మెల్యే ఆరోపణలపై విచారణ జరపాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్‌ రెడ్డి. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకుని వెంటనే విచారణకు ఆదేశించాలని కోరారు..

మొత్తంమీద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్‌ను కాంగ్రెస్ నేతలు ఆషామాషీగా తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆయన కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. కీలక విషయాలలో కేసీఆర్‌ కొంతమందితో చర్చించాకే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వారిలో కొత్త ప్రభాకర్‌ రెడ్డి కూడా ఒకరు.. గతంలో మెదక్ ఎంపీగా కేసీఆర్‌ పోటీ చేయమంటేనే బరిలో నిలిచారు. ఆ తర్వాత దుబ్బాక ఎమ్మెల్యే అయ్యారు. అందుకే ఈ కామెంట్స్‌ను కాంగ్రెస్‌ నేతలు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది. అతడి కామెంట్స్ వెనుక ఎవరున్నారు అనే కోణంలో ప్రభుత్వం ఎంక్వైరీ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. 

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. అర్ధగంట పాటు అతలాకుతలం

Also Read: Tariff war-Investors: ఎంత పని చేశావ్‌ ట్రంప్‌.. నీ వల్ల నిద్ర కూడా పట్టడంలేదు.. ఇన్వెస్టర్ల షాకింగ్ కామెంట్స్..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News