Kalva kuntla Kavitha: బీసీల కొంపలు ముంచిది కాంగ్రెస్ పార్టీనే.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారంటే..?

kavitha comments on bc reservation bill: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ  బీసీల రిజర్వేషన్ బిల్లుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలను అసలు మోసం చేసిందీ కాంగ్రెస్ పార్టీనే అంటూ శివాలెత్తిపోయారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 18, 2025, 04:55 PM IST
  • మరోసారి మండిపడిన కవిత..
  • బీసీ రిజర్వేషన్ లపై కీలక వ్యాఖ్యలు..
Kalva kuntla Kavitha: బీసీల కొంపలు ముంచిది కాంగ్రెస్ పార్టీనే.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారంటే..?

mlc Kavitha sensation comments on bc reservation bill: తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ బిల్ మాత్రం హట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకున్నారు. మరోవైపు పార్లమెంట్ లో సైతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకునేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీల నేతలతో కలిసి ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లనున్నారు.

Add Zee News as a Preferred Source

ఇప్పటికే తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని రేవంత్ .. పీఎంవోకు లేఖను సైతం రాశారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ అంశం తెగ రచ్చగా మారింది. తాజాగా.. తీన్మార్ మల్లన్న సైతం.. బీసీల కోసం తమతో కలిసి రావాలని అన్ని పార్టీల నేతల్ని వరుసగా కలుసుకుని లేఖలు సైతం ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా.. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తొందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. గతంలో.. కాలేల్కర్ కమిటీ నివేదికను పట్టించుకోలేదన్నారు. అప్పుడు ప్రధాని నెహ్రూ ఉన్నారన్నారు. ఆ తర్వాత.. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదని గుర్తు చేశారు. మళ్లీ.. వి.పి సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారన్నారు.

అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు బీసీల గురించి ఆలోచన చేయలేదని, ఇప్పుడు మాత్రం ఏదో బీసీలకు తామే నడుంబిగించినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో.. పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారని గుర్తు చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్చిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ వాదించారు. అంతేకాకుండా..  రూ. 4300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం గణనను చేయించింది.  కానీ ఆ నివేదికను ఇప్పటివరకు బయట పెట్టలేదన్నారు.

ఆ నివేదిక గురించి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎందుకు మాట్లాడలేదంటూ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ వర్గీకరణ కోసం మోడీ ప్రభుత్వం వేసిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను బైటపెట్టలేదన్నారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది . అసలు ఈ 42 శాతం అన్న లెక్కకు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రశ్నల  వర్షం కురిపించారు.

కులాల వారీగా , గ్రామాల వారిగా బీసీ జనాభాను ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదన్నారు. బీసీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల భవిష్యత్తు తరాలకు ఇబ్బంది అవుతుందన్నారు. బిల్లులో కేటగిరీ వారీగా రిజర్వేషన్లను ప్రభుత్వం ఎందుకు పెట్టలేదని,  ఏ గ్రూపుకు ఎంత రిజర్వేషన్లు కేటాయిస్తారన్న వివరాలు లేవని ఎమ్మెల్సీ కవిత అన్నారు. న్యాయపరమైన చిక్కుల్లో ఈ చట్టాలు ఇరుక్కోవద్దన్నది తమ అభిమానమని కవిత అన్నారు. చిన్న చిన్న విషయాల మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే చట్టాలను కొట్టివేసే ప్రమాదం ఉందన్నారు.

బీసీ సబ్ ప్లాన్ ను ప్రభుత్వ రూపొందించాలని, బీసీలకు ఏటా రూ 20 వేల కోట్ల మేర బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి గత ఏడాది కేవలం 9200 కోట్లను మాత్రమే  ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే..  బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే అభివృద్ధిలో దేశం అమెరికాను దాటిపోయేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

మనంతల మనమే 50 శాతం జనాభాను అవకాశాలకు ఇన్ని సంవత్సరాల పాటు దూరం పెట్టుకొవడం బాధకరమన్నారు. బీసి, ఎస్సీ, ఎస్టి, మహిళలకు అవకాశాలు దక్కితేనే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమవుతుందని కవిత అన్నారు. ఉద్యోగ అవకాశాల్లో జాతీయస్థాయిలో 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా..  ఇప్పటికీ కూడా 23% ఎప్పుడు భర్తీ కాలేదని, యూపీఎస్సీలో 27% బీసీలకు రిజర్వేషన్లు ఉన్నా కూడా ఎప్పుడూ 8 శాతం అవకాశాలు కూడా దక్కలేదన్నారు. బీసీ వర్గాలు ఆర్థిక అసమానతలు కూడా ఎదుర్కొంటున్నారన్నారు.

Read more: BRS KTR: రేవంత్ రెడ్డి కాపురంలో చిచ్చుపెట్టిన కేటీఆర్.. రోజు ఉదయం 5 గంటలకు అక్కడికి వెళ్లేవాడంటూ షాకింగ్ కామెంట్స్..

దేశంలో 50% జనాభా ఉన్న బీసీల వద్ద కేవలం 15% మాత్రమే సంపద ఉంది ... ఈ అసమానతలను సరి చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉందన్నారు. ఆర్థిక స్వతంత్రం, అధికారం, ఆత్మగౌరవం కోసం బీసీలంతా పోరాటం చేస్తున్నారు. అనేక బీసీ కులాలు దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తుండడం ఆందోళనకరమన్నారు. సంచార జాతుల వారి పిల్లలకు విద్య విషయంలో ఎంతో ఆవేదన కలుగుతుందన్నారు. కేసీఆర్ గారు సంచార జాతుల వారి కోసం రెసిడెన్షియల్ స్కూల్ లలో ప్రత్యేకంగా కోటాను ఏర్పాటు చేశారు .కానీ కాంగ్రెస్ మాత్రం దాన్ని అమలు చేయలేదని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News