Brs mlc kalvakuntla Kavitha fires on cm revanth reddy: తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ హెచ్‌సీయూ భూముల వివాదం కాకరేపుతుంది. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. అదే విధంగా హైకోర్టు రిజిస్ట్రార్ తో దీనిపైన నివేదిక తెప్పించుకుని, రేవంత్ కు మొట్టికాయలు వేసింది. ఇదిలా ఉండగా.. తెలంగాణ సీఎం రేవంత్ మనుషుల్నే కాదు.. నోరులేనీ జీవాల ప్రాణాలు కూడా తీస్తున్నాడని మండిపడ్డారు. 400 ఎకరాల్లో ఉన్న పచ్చదనాన్ని పూర్తిగా నాశనం చేసే కుట్రలకు తెరలేపారన్నారు.
ఈ క్రమంలో దాశరథి శత ఉత్సవాల్లో భాగంగా "ఆ చల్లని సముద్ర గర్భం" దృశ్యగీతాన్ని తెలంగాణ జాగృతి రూపోందించింది. ఈ దృశ్యగీతం ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా.. కంచ గచ్చిబౌలి భూముల్లో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నెమళ్ళు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. లేళ్లకు, అనేక మూగజీవాలకు సీఎం రేవంత్ నిలువ నీడ లేకుండా చేస్తున్నారన్నారు.
చెట్లను నరికి ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు.. పర్యావరణ హణనానికి పాల్పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కేసీఆర్ గారి హయాంలో తెలంగాణలో అడవులు 7.7 శాతం పెరిగాయని.. అదే విధంగా హైదరాబాద్ కు గ్రీన్ ఎన్నిరాన్ మెంట్ అవార్డు సైతం వచ్చిందని గుర్తు చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని.. చెట్లను నరికేసే పరిపాలన అంటూ సెటైర్ లు వేశారు. తెలంగాణ నేల మీద ఇప్పుడు మరో ఉద్యమం జరుగుతుందన్నారు. రేవంత్ ఎట్టిపరిస్థితుల్లో హెచ్సీయూ వివాదంపై వెనక్కు వెళ్లాల్సిందేనంటూ మండిపడ్డారు.
నిజాం రాజు ఎన్ని హింసలు పెట్టినా దాశరథి తెలంగాణ వాదాన్ని వదలలేదని అన్నారు. ప్రజా ఉద్యమంలో పాల్పంచుకున్న గొప్ప వ్యక్తి దాశరథి అని.. ఆయన రచనలు.. తెలంగాణ ఉద్యమానికి దాశరథి రచనలు స్ఫూర్తినిచ్చాయన్నారు. దాశరథి స్పూర్తిగా ఉద్యమంలో ముందుకు వెళ్తామన్నారు. రేవంత్ కు పాలన మీద అస్సలు సోయిలేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తుందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









