)
kavitha again fires on brs party: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం వానాకాలంలో అగ్గిని రాజేస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య బనక చర్ల ప్రాజెక్ట్ వివాదం రచ్చకు దారి తీసిన విషయం తెలిసిందే.దీనిపై ఇటీవల ఏపీ మంత్రి నారాలోకేష్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా కౌంటర్ లు ఇచ్చాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా రోజుల నుంచి అంటి ముట్టనట్లు ఉంటూ ఎమ్మెల్సీ కవిత హట్ కామెంట్స్ చేస్తు తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఈ క్రమంలో మరోసారి కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
కవిత ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై నల్గొండకు చెందిన నేత వ్యాఖ్యలు చేయడం వెనకాల బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత ఉన్నారని బాంబు పేల్చారు. అంతే కాకుండా.. నల్గొండలో పార్టీ ఓడిపోవడానికి కారణమైన వ్యక్తి ఈ రోజు నా గురించి కాంట్రవర్సీగా మాట్లాడితే.. బీఆర్ఎస్ సోదరులు స్పందించక పోవడం బాధకరమన్నారు. ఒక ఇంటి ఆడబిడ్డను పట్టుకుని మాట్లాడుతుంటే.. ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు.
MLC Kavitha says BRS leader behind the use of derogatory words by Teenmaar Mallanna
She criticised Jagadish Reddy and called him Lilliput. Blamed him for destroying BRS in Nalgonda district. If KCR is not there, who are you
After this, one small leader who joined recently also… pic.twitter.com/bfV1Wacx0g
— Naveena (@TheNaveena) August 3, 2025
తన లెటర్ లీకేజీ వెనుకాల కూడా కొంత మంది కుట్రలు ఉన్నాయన్నారు. జగదీష్ గతంలో కవితపై చేసిన వ్యాఖ్యలపై కవిత కౌంటర్ లు ఇచ్చారు . కేసీఆర్ పెట్టిన దయ వల్ల పార్టీలో ఉన్న విషయం గుర్తు పెట్టుకొవాలన్నారు. నల్గొండలో పార్టీ ఓటమికి కారణమైన లిల్లిపూట్ నేత తన గురించి మాట్లాడటం హస్యాస్పదం అన్నారు. తనకు సీఎం రమేష్ తెలుసని.. కానీ ఇటీవల కాలంలో ఆయనతో మాట్లాడలేదన్నారు.
తనను బద్నాం చేసి, పార్టీకి దూరం చేసి ఒంటరిని చేయాలని అనుకుంటున్నారని చెప్పారు. తాను కర్మ సిద్దాంతంను నమ్ముతానని, ఇలాంటి వ్యాఖ్యలు చేసి కొంత మంది శునకానందం పొందొచ్చని అన్నారు. కానీ దేవుడు తప్పకుండా తిరిగి కొడ్తుందన్నారు. తనను నల్గొండ నుంచి ఆమె ఎవరు..?..ఈమె ఎవరు అని అంటుండూ.. చావు తప్పి కన్ను లోట్టపోయిన నేత.. తన గురించి మాట్లాడుతున్నాడని అన్నారు.
ఇలాంటివన్ని బైటికొస్తాయని, ఇంటి ఆడబిడ్డమీద నీచమైన మాటలు మాట్లాడి బహిర్గతం చేసి, దీనిపై రాజకీయాలు చేస్తున్న వారి విషయాలు బైటకు వస్తాయన్నారు. సమయం వస్తే అన్ని విషయాలు ప్రజలకు నిజాలు తెలుస్తాయన్నారు.ఈ క్రమంలో గతంలో జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. కవితను ఎవరు పట్టించుకోవట్లేదని, పార్టీ ఆమెను లైట్ తీసుకుందని మాట్లాడారు. ప్రస్తుతం కవిత ఈ కామెంట్స్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.