Waqf Bill:కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా వారి తరపున పోరాడుతామన్నారు. BRS పార్టీ మైనార్టీల తరుపున వుంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు మైనారిటీలకు హోం శాఖ ఇచ్చి గౌరవించి పార్టీ తమదన్నారు.
తాము అధికారంలో ఉన్నపుడు ముస్లిం మైనారిటీలకు కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వాటిని బంద్ చేసిందని మండిపడ్డారు. మైనార్టీల కోసం పెట్టిన బడ్జెట్ లో 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. మైనార్టీల కోసం యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చిందన్నారు.
కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదన్నారు. బాన్సువాడ లో జరిగిన ఇఫ్తార్ విందులో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మైనారిటీకి కూడా కేబినేట్ లో చోటు కల్పించలేదన్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు సీటు కూడా ఇవ్వలేదన్నారు. మైనారిటీల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మొండిచేయి చూపిస్తుందన్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామన్న హామి ఏమైందని ప్రశ్నించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









