KT Rama Rao Chit Chat: 'ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ బహిరంగ సభ చరిత్రలో అతిపెద్ద సమావేశం కానుంది' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేయడాన్ని తప్పుబట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ప్రశాంత వాతావరణంలో రజతోత్సవ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన వరంగల్ సభ మాదిరి భారీగా నిర్వహణ చేయబోతున్నట్లు చెప్పారు.
Also Read: Kancha Gachibowli: హెచ్‌సీయూ, కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ సంచలన లేఖ
బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల నిర్వహణపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. 'వరంగల్ ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ప్రజలకు ఇబ్బంది కానీ ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు తెలుగుదేశం, బీఆర్ఎస్ మాత్రమే' అని ప్రకటించారు. ఎల్కతుర్తిలో 1,200 ఎకరాల్లో పార్కింగ్‌తో పాటు సభ ఏర్పాటు అన్ని ఘనంగా జరుగుతున్నాయని వెల్లడించారు.
Also Read: Bandi Sanjay: 'పాలనపై పట్టులేని రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి'
'ఏడాదిపాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తాం. 28వ తేదీ మార్చి రోజున సభ అనుమతి కోసం జిల్లా పోలీసులకు దరఖాస్తు చేశాం' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. 'ప్రభుత్వం గతంలో మా పార్టీ సమావేశాలకు అనుమతులు ఇవ్వకుంటే ఇబ్బందులు పెట్టింది. ఈ బహిరంగ సభకు కూడా అనుమతులు ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించి అనుమతి పొందుతాం. అనుమతి ఇవ్వక పోవడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి కారణాలు లేవు. అత్యంత శాంతియుతంగా పార్టీ నిర్వహించుకుంటున్న ఒక సంబరం మాత్రమే' అని కేటీఆర్ వెల్లడించారు.
'ఆర్టీసీ ద్వారా 3000 బస్సుల కోసం విజ్ఞప్తి చేయగా.. ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. 27వ తేదీ ఆదివారంతో విద్యార్థులకు సెలవులు ఉండటం కారణంగా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు. 33 జిల్లాల నాయకులు ప్రతినిధులతో కేసీఆర్ స్వయంగా నియోజకవర్గాల వారికి సమీక్ష నిర్వహించారు. పార్టీపరంగా కమిటీలను వేసుకుంటాం. మా పార్టీ చరిత్రలో ఈ సమావేశం అతిపెద్ద మీటింగ్' అని కేటీఆర్ వెల్లడించారు. గతంలో జరిగిన వరంగల్ సభ మాదిరి భారీగా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
బహిరంగ సభ తర్వాత విద్యార్థి, కార్యకర్తల సభ్యత్వ నమోదు చేస్తామని కేటీఆర్ తెలిపారు. సభ్యత నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని.. సభ్యత్వ నమోదు తర్వాత అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని వివరించారు. రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను ఇతర కమిటీలను వేసుకుంటామని వెల్లడించారు. ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తల శిక్షణ సమావేశాలు ఉంటాయని చెప్పారు. ప్రతినెల ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించేలా 12 నెలలపాటు కొనసాగేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు.. ఈ సంవత్సరం మొత్తం సంస్థాగత నిర్మాణంతోపాటు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని కేటీఆర్ వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









