Central Water Commission: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు రద్దు చేయడంపై బీఆర్‌ఎస్ పార్టీ హర్ష వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నాట్లు ఆ పార్టీ ప్రకటించింది. 'ఇది బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం విజయం.. తెలంగాణ ప్రజల విజయంగా అభివర్ణించారు.
Also Read: Banakacherla Project: చంద్రబాబుకు భారీ దెబ్బ.. బనకచర్లపై కేంద్రం అభ్యంతరం
ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు
'బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలుపుతున్నాం. జై తెలంగాణ' అని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు పోస్టు చేశారు.
Also Read: Raja Singh Resign: తెలంగాణ బీజేపీలో సంక్షోభం.. ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా
గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి నిరాకరణ హర్షణీయంగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా, పెన్నా బేసిన్‌లకు తరలించేందుకు చేపట్టిన గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు నిరాకరించడం హర్షణీయం' అని ఎక్స్ వేదికగా కవిత పోస్టు చేశారు.
గోదావరి – బనకచర్లకు పర్యావరణ అనుమతి నిరాకరణ హర్షణీయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా, పెన్నా బేసిన్ లకు తరలించేందుకు చేపట్టిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు నిరాకరించడం హర్షణీయం… pic.twitter.com/3BwqxyAM2K
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 30, 2025
'ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ 33వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ పార్టీలు సాధించిన విజయం. చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ జల పిడీకి ద్వారాలు తెరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేయాలి. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుపై వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. గోదావరిలో తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన 968 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసే వరకు గోదావరి -బనకచర్ల ప్రాజెక్టు పట్టాలెక్కకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి' అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
Central Water Commission (CWC), GWDT పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం.
ఇది @BRSparty పోరాటం విజయం. తెలంగాణ ప్రజల విజయం.
బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా…
— Harish Rao Thanneeru (@BRSHarish) June 30, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









