)
Saddula Bathukamma: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉన్న బతుకమ్మ పండుగకు కాంగ్రెస్ పాలనలో.. రేవంత్ రెడ్డి తీవ్ర అవమానం జరుగుతోందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయకుండా అవమానిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ తల్లి బతుకమ్మ విగ్రహం చేతిలో బతుకమ్మను తీసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నిధులు, చీరలు ఇవ్వకుండా వేధిస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: BRS Party: మెట్రో రైలు వివాదం.. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు..
హన్మకొండలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న పద్మా దేవేందర్, సత్యవతి రాథోడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేదు.. బతుకమ్మ పండుగకు నిధుల్లేవు అని.. మహిళలకు పండుగకు ఇవ్వాల్సిన బతుకమ్మ చీరెలను కూడా పంపిణీ చేయడం లేదు' అని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. మహిళలు బతుకమ్మ పండుగను సంతోషంగా చేసుకోకుండా యూరియా కోసం లైన్లు కడుతున్నారని తెలిపారు.
Also Read: KTR Wishes: 'ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ'
బతుకమ్మ పండుగను కనుమరుగు చేయాలని రేవంత్‌రెడ్డి సంకల్పిస్తున్నట్లుగా ఉందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆందోళన వ్యక్తం చేశారు. పండుగ సమయంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేస్తే.. కాంగ్రెసోళ్లు మహాలక్ష్మి పేరుతో మహిళలను బతుకమ్మ ఆడకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మహిళలకు అందజేస్తున్న బతుకమ్మ చీరలపై ఇందిరాగాంధీ బొమ్మ వేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ బతుకమ్మ పండుగకు ఇందిరాగాంధీకి ఏమిటి సంబంధం అని నిలదీశారు. మహిళలను అన్ని విధాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పాలన పట్ల మహిళలంతా ఆలోచించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటువేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేశారు.
Also Read: Jr NTR: కాంతారా హీరో రిషబ్ శెట్టిపై జూ ఎన్టీఆర్ ప్రశంసలు.. 'మా అమ్మ కోరికను తీర్చాడు'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook