INC A To Z Scams: భారతదేశంలో శతాబ్దంన్నర చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అదే స్థాయిలో అవినీతి మరకలు ఉన్నాయి. దేశంలో ఏ పార్టీ చేయనన్ని కుంభకోణాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ పార్టీ ఆరోపించింది. ఏ నుంచి జెడ్ వరకు కాంగ్రెస్ చేసిన కుంభకోణాలను గులాబీ పార్టీ బహిర్గతం చేసింది. కాంగ్రెస్ కుంభకోణాలను బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి బయటపెట్టారు.
Also Read: Konda Surekha: ముదురుతున్న వరంగల్ కాంగ్రెస్ లీడర్ల కయ్యం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం కుంభకోణాలు.. అవినీతి అని తెలిపారు. భారతదేశం, ఉమ్మడి ఏపీతోపాటు ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణాలను జీవన్ రెడ్డి వివరించారు. ఆయన ప్రకటన ప్రకారం కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల జాబితాల ఇలా ఉంది.
Also Read: Harish Rao: 'తెలంగాణకు రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఉరి తీసినా తప్పులేదు'
కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల జాబితా
A-అంటే అనుముల బ్రదర్స్ స్కామ్‌లు
B- అంటే బస్సుల స్కామ్
C- అంటే కరప్షన్, కమీషన్లు, కలెక్షన్లు
D- అంటే డాక్యుమెంటరీ ఫోర్జరీ స్కామ్స్, ఢిల్లీకి డబ్బుమూటలు
E- అంటే ఎంప్లాయి రిక్రూట్‌మెంట్ స్కామ్‌లు
F- అంటే ఫార్మా భూ దందాలు, ఫోర్త్ సిటీ స్కామ్‌లు, ఫయిమ్ ఖురేషీ అక్రమాలు
G- అంటే గ్రెయిన్స్ స్కామ్
H- అంటే హైడ్రా కలెక్షన్స్ స్కామ్, హైడ్రా క్లియరెన్స్
I- అంటే ఇందిరమ్మ ఇండ్ల కుంభకోణం
J- అంటే జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం, మంత్రులు, అధికారులు జైళ్ల పాలు
K- అంటే కర్ణాటక మిల్క్ కోపరేటివ్ స్కామ్ ద్వారా రేవంత్ రెడ్డి అకౌంట్‌లోకి రూ.45 కోట్లు
L- అంటే లియోనియా రిసార్ట్ ల్యాండ్ స్కామ్ రూ.10,000 కోట్లు
M- అంటే మైనింగ్ మాఫియా
N- నేషనల్ హెరాల్డ్ స్కామ్
O- అంటే ఆఫర్స్ స్కామ్‌లు, ఆన్‌లైన్ బెట్టింగులు
P- అంటే ప్యాడీ స్కామ్
Q- అంటే- క్వారీల స్కామ్ (గ్రానైట్, శాండ్)
R- అంటే రైస్ స్కామ్, ఆర్‌ఆర్‌ఆర్ ట్యాక్స్
S- అంటే శాండ్ మాఫియా
T- అంటే ట్రైబల్ వెల్పేర్ స్కామ్
V- అంటే వోట్ ఫర్ నోట్ కేసు, వాల్మీకి కుంభకోణం
W- అంటే వెస్ట్రన్ స్ప్రింగ్ స్కామ్, వైన్ మాఫియా, లిక్కర్ రేట్ల పెంపు, వైట్ కాలర్ క్రైమ్స్
X, Y- రేవంత్ రెడ్డి నివాసంలో కొన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి.
Z- అంటే జీరో దందాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









