Revanth Reddy Killed Deers: జింకను వేటాడారనే కారణంతో సినీ హీరో సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేసి జైల్లో వేయగా.. మూడు జింకలు చంపిన రేవంత్ రెడ్డిని శిక్షించారా?' అని బీఆర్‌ఎస్ పార్టీ ప్రశ్నించింది. ప్రభుత్వం అడవులను విధ్వంసం చేసి.. జంతువులను తరిమేశారని తెలిపింది. వాల్టా చట్టం కఠినంగా అమలు చేయాల్సి ఉండగా.. రేవంత్ రెడ్డికి ఒక న్యాయం.. రైతుకు ఒక న్యాయం ఉంటుందా? అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు కమిటీ ముందు రేవంత్ రెడ్డి వైఫల్యం.. భారీ తప్పిదాలు.. హెచ్‌సీయూ విధ్వంసం వంటి వివరాలను బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు వివరించారు.
Also Read: Colleges Bandh: రేపు తెలంగాణలో కళాశాలల బంద్.. ఎందుకో తెలుసా?
హెచ్‌సీయూ భూముల వివాదంపై స్వయంగా పరిశీలనకు వచ్చిన సుప్రీంకోర్టు కమిటీకి బీఆర్‌ఎస్ పార్టీ కలిసి తన నివేదికను సమర్పించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం.. అడవిని నరికేయడం.. హెచ్‌సీయూ భూముల చరిత్ర, విద్యార్థులపై జరిగిన దాడి వంటివి కేంద్ర పర్యావరణ సలహా కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలను వెల్లడించి రేవంత్ రెడ్డి తీరును ఎండగట్టారు. కమిటీని కలిసిన అనంతరం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు కీలక విషయాలు తెలిపారు.
Also Read: Harish Rao: 'తెలంగాణను కేసీఆర్ నిలబెడితే.. రేవంత్ రెడ్డి పడగొట్టాడు'
'కంచె గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలు ఉల్లఘించిందని కమిటీకి చెప్పాం. కమిటీకి పార్టీ తరఫున 15 పేజీల నివేదిక ఇచ్చాం. ప్రభుత్వం అడవులను విధ్వంసం చేసి జంతువులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిందని చెప్పాం. వందలాది చెట్లు నరుకుతుంటే రెవెన్యూ, అటవీ శాఖ ఏం చేసింది' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
ఇళ్లు కట్టడానికి చెట్లను తొలగించాలంటే వాల్టా చట్టం ప్రకారం అటవీ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. రైతులు ఎక్కడైనా చెట్లు కొడితే ట్రాక్టర్ సీజ్ చేసి పనిముట్లు సీజ్ చేసి జరిమానా వేస్తారు. అలాంటిది రేవంత్ రెడ్డికి ఒక న్యాయం.. రైతుకు ఒక న్యాయం ఉంటుందా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. 'సెంట్రల్ యూనివర్సిటీలో జింకలు చనిపోయాయి. సల్మాన్ ఖాన్ జింకను చంపితే జైల్లో పెట్టారు. సెంట్రల్ యూనివర్సిటీలో జింకలు చనిపోవడానికి రేవంత్ రెడ్డి కారణం కాదా? మరి ఏం చర్యలు తీసుకున్నారు' అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
'అటవీశాఖ నేరపూరిత నిర్లక్ష్యంతో వందల చెట్లను నరికారు. శని, ఆదివారాల్లో ఎలాంటి కూల్చివేతలు చేయవద్దని హైకోర్టు చెప్పినా.. తీర్పులను ఉల్లంఘించి చెట్లను నరికారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయం కట్టాలనుకుంటే రేవంత్ రెడ్డి చెట్లు కొట్టవద్దని గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లగా.. గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేసింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. జీవ విధ్వంసంలో పోలీసులు భాగస్వామ్యం అయ్యారని ఆరోపించారు. 'రేవంత్ రెడ్డిపై సుమోటోగా కేసు పెట్టాలి. భూములను సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగించాలి' అని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది.
సల్మాన్ ఖాన్ కు ఒక న్యాయం
రేవంత్ ప్రభుత్వానికి ఒక న్యాయమా ?ఒక్క జింకను చంపితే సల్మాన్ ఖాన్ ను జైల్లో పెడితే..
మూడు జింకలను చంపిన రేవంత్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి.- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు ? pic.twitter.com/BHkvVWrlf2
— Office of Harish Rao (@HarishRaoOffice) April 10, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









