)
KT Rama Rao: ప్రపంచానికి మన విశిష్ట సంస్కృతిని చాటిచెప్పే గొప్ప పండుగ ఇదేనని ఇదేనని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ మహిళలందరికీ ఈ సందర్భంగా కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటే పండుగ బతుకమ్మ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీకగా సద్దుల బతుకమ్మ పండుగ నిలుస్తుందని ప్రకటించారు.
సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు మాజీ మంత్రి కె తారక రామారావు పత్రిక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, గౌరమ్మను భక్తితో కొలిచే సబ్బండ వర్ణాల సంబురం బతుకమ్మ పండుగ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని గుర్తుచేశారు. పువ్వులను దేవతగా పూజించే ఈ ఉత్సవం... తెలంగాణ సంస్కృతి, మన అస్తిత్వం మరియు ప్రకృతితో మనకున్న అనుబంధానికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. ప్రపంచానికి మన విశిష్ట సంస్కృతిని చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు.
తెలంగాణ నారీలోకం తొమ్మిది రోజుల పాటు ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో ప్రకృతిని పూజిస్తూ, ఆటపాటలతో జరుపుకున్న ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషాన్ని, సిరిసంపదలను తీసుకురావాలని మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. ప్రతి ఆడపడుచు జీవితంలో ఆనందం, సౌభాగ్యం నిండుగా ఉండాలని.. దీనికి ఆ బతుకమ్మ తల్లిని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెబుతూ కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook