Brs Harish rao: హరీష్‌ రావుకు తీవ్ర అస్వస్థత.. కిమ్స్ కు తరలింపు.. ఆందోళనలో గులాబీ శ్రేణులు..

Brs harish rao admitted in kims: మాజీ మంత్రి హరీష్‌ రావు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటీన బేగంపేటలోని కిమ్స్ కు తరలించారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 16, 2025, 09:19 PM IST
  • ఆస్పత్రిలో అడ్మిట్ అయిన హరీష్ రావు..
  • టెన్షన్ లో గులాబీ శ్రేణులు..
Brs Harish rao: హరీష్‌ రావుకు తీవ్ర అస్వస్థత.. కిమ్స్ కు తరలింపు.. ఆందోళనలో గులాబీ శ్రేణులు..

brs senior leader Harish rao hospitalized: బీఆర్ఎస్ కీలక నేత, ట్రబుల్ షూటర్ హరీష్‌ రావు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి ఆయన ఫార్మూల్ ఈ రేసింగ్ కారు కేసు విచారణ సందర్భంగా  ఉదయం నుంచి ఆయన కేటీఆర్ తో ఉన్నారు.  ఈ క్రమంలో కేటీఆర్ ఫార్మూల్ ఈ రేస్ కారు విచారణ ముగించుకుని బైటకువచ్చే వరకు కూడా ఆయన కోసం ముఖ్యనేతలు,  కార్యకర్తలతో కలిసి వేచి ఉన్నారు.

Add Zee News as a Preferred Source

ఈ నేపథ్యంలో హరీష్‌ రావుకు అప్పటికే హైఫీవర్ తో బాధపడుతున్నారని, అయిన కూడా కేటీఆర్ కోసం అక్కడకు వచ్చారని తెలుస్తొంది. ఈ క్రమంలో కేటీఆర్ ఏసీబీ విచారణ ముగించుకున్నాక కూడా కేటీఆర్ తో తెలంగాణ భవన్ లో హరీష్ రావు ఉన్నారు.

అయితే.. ఒక్కసారిగా హరీష్‌ రావు అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు బేగంపేటలోకి కిమ్స్ కు తరలించారు. కేటీఆర్  ఫార్మూలా ఈ రేసింగ్ కేసు విచారణ సందర్భంగా హరీష్‌ రావు జ్వరం ఉన్నాకూడా కార్యకర్తల్ని, నేతల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లారు.

నిన్నటి నుంచి హరీష్‌ రావు బిజీ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలో కేటీఆర్ బైటకు వచ్చిన తర్వాత.. తెలంగాణ భవన్ లో మాట్లాడుతుండగా.. ఆయనవెనకాల ఉన్నారు. చాలా డల్ గా ఉన్నారు. అంతే కాకుండా.. ఒక్కసారిగా స్టమక్ పట్టుకుని పక్కకు వెళ్లిపొయారు. వెంటనే సన్నిహితులు కిమ్స్ కు తరలించారు.  హైఫీవర్ తో ఆయన కిమ్స్ లో అడ్మిట్ అయ్మారు. ఈ క్రమంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

Read more: Formula e car race case: ఫార్మూలా ఈ కారు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ కు ఏసీబీ ఆదేశాలు..

ప్రస్తుతం వైద్యులు ఆయనను పర్యవేక్షిస్తున్నారు. హరీష్‌ రావు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కానీ మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు మాత్రం హరీష్‌రావు హెల్త్ పట్ల టెన్షన్ కు గురౌతున్నారు. ఆయన వెంటనే కోలుకొవాలని కూడా ప్రార్థనలు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News